ప్ర‌కాశంలో మ‌రో ఇద్ద‌రు టీడీపీ ఇంచార్జ్ లు వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-14 16:26:57

ప్ర‌కాశంలో మ‌రో ఇద్ద‌రు టీడీపీ ఇంచార్జ్ లు వైసీపీలోకి

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయంటే రాజ‌కీయ నాయ‌కులు ఏ కల‌ర్ రంగుపూసుకుని వ్య‌వ‌హ‌రిస్తారో తెలియ‌దు. నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన అధికార నాయ‌కులు కానీ, అధికార నాయ‌కుల‌పై నిప్పులు చెరిగిన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు క‌నీ త‌మ రాజ‌కీయ భ‌విష‌త్ ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేయ‌డం స‌ర్వ‌స‌ధార‌ణం. అయితే ఎన్న‌డు లేని విధంగా ఈ సంవ‌త్స‌రం అధికార తెలుగుదేశం పార్టీనుంచి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ లోకి విప‌రీతంగా చేరుతున్నారు. ఇక వారితోపాటు గతంలో రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌  కీల‌క రాజ‌కీయ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి, పాద‌య‌త్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న‌తో పాటు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన  కీల‌క రాజ‌కీయ నాయ‌కులు కూడా వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నార‌ట‌. 2014లో టీడీపీ అధికాంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అధిష్టానం త‌రుపున త‌మ‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని ఆ ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు ఎంతో కాలంగా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. 
 
విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం టీడీపీకి చెందిన ఆ ఇద్ద‌రు నాయ‌కులు మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి వైసీపీ తీర్థం తీసుకున్న త‌ర్వాత మ‌రో వారంలో వైసీపీ తీర్థం తీసుకోవాల్సి ఉంది. కానీ ఎన్నిక‌లకు ఇంకా ప‌ది నెల‌లు స‌మ‌యం ఉన్న క్ర‌మంలో టీడీపీ అధిష్టానం అసెంబ్లీ సీట్లు కేటాయించిన త‌ర్వాత వారు కూడా వైసీపీ తీర్థం తీసుకుంటార‌ని తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే టీడీపీ అధిష్టానం ఆ ఇద్ద‌రి నాయ‌కుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ సీట్లు కేటాయించ‌క‌పోతే టీడీపీ ఇంచార్జ్ లు వైసీపీ తీర్థం తీసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.