జ‌గ‌న్ కేసుల పై కేంద్రమంత్రి రెస్పాన్స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-05 15:52:08

జ‌గ‌న్ కేసుల పై కేంద్రమంత్రి రెస్పాన్స్ ?

త‌మ‌తో మైత్రి కొన‌సాగించి నాలుగేళ్లు క‌లిసి ఉండి ఇప్పుడు రాజ‌కీయాలు చేస్తున్న తెలుగుదేశం అధినేత పై బీజేపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నారు... ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చంద్ర‌బాబు వైఖ‌రిపై మండిప‌డుతున్నారు.. ఇంత హైడ్రామా చేస్తున్న బాబు గ‌తంలో ప్యాకేజీకి ఎందుకు ఒప్ప‌కున్నారు, అప్పుడు ప్యాకేజీ వ‌ద్దు అని దిల్లీ వ‌చ్చి గ‌ర్జించ‌వ‌చ్చు క‌దా అని అడుగుతున్నారు బీజేపీ నాయ‌కులు.
 
కేంద్ర‌మంత్రి ప్రకాష్‌ జవదేకర్, చంద్ర‌బాబు పై తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు.  మేంస్నేహానికి విలువ ఇస్తాం చంద్ర‌బాబు లా రాజ‌కీయాలు చేయ‌లేమ‌ని ఆయ‌న అన్నారు.. ప్ర‌జ‌ల‌కు ప్రాంతాల‌కు విలువ గౌర‌వం ఇస్తాం అని అన్నారు..విభజన చట్టంలో ఉన్న వాటితో పాటు లేనివీ కూడా మేం చేసిన తీరు నరేంద్ర మోదీ మహత్తుకు అద్దంపడుతుంది అని ఆయ‌న తెలియ‌చేశారు.
 
పొత్తువ‌ల్ల 15 సీట్లు వ‌చ్చాయ‌ట అలా ఆయ‌న అన‌డం బాధించింది..2014లో మాతో పొత్తు లేకుంటే మీరు ఎక్కడుండేవారు. ఇలా నిందారోపణలు చేయడం సరికాదు అని ఆయ‌న అన్నారు..మ‌రో ప‌క్క వైసీపీకి ద‌గ్గ‌ర అవుతున్నాము అని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.. ఇక జ‌గన్ కు బీజేపీకి బంధం బ‌ల‌ప‌డుతోంది అని పుకార్లు సృష్టిస్తున్నారు అవ‌న్ని అవాస్త‌వాలు అని ఆయ‌న కొట్టిపారేశారు.
 
రాజకీయాలు చేయవచ్చుగానీ అవాస్తవ రాజకీయాలు చేయకూడ‌దు అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ఆర్థిక నేరారోపణలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేక దర్యాప్తులు చేస్తుంటాయని, జగన్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని, కేసు విచారణ జరుగుతోందన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.