లోకేశ్ కు కౌంట‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-12 16:34:41

లోకేశ్ కు కౌంట‌ర్

రాష్ట్రంలో ప్ర‌త్యేక హూదా పోరు పీక్ స్టేజీకి చేరింది అనే చెప్పాలి.... తెలుగుదేశం నాయ‌కులు చేస్తున్న ప‌నుల పై వైసీపీ విమ‌ర్శిస్తోంది... అస‌లు చెవులో పువ్వులు పెట్టుకుని, చేతికి న‌ల్ల రిబ్బ‌ర్లు చొక్క‌ల‌కు న‌ల్ల బ్యాడ్జీలు క‌ట్టుకుని నిర‌స‌న తెలిపే ప‌ద్ద‌తి ఏమిటి... దీని వ‌ల్ల మోదీ కాదు క‌దా అస‌లు రాజ‌కీయం అంటే ఏమిటో తెలియ‌ని వాడు  కూడా చూసి న‌వ్వుతున్నాడు.. అయినా తెలుగుదేశం అదే ప్ర‌కారంగా వ‌ర్క్ చేస్తోంది. 
 
ఇక నెల్లూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు  ఫైర్ అయ్యారు.. ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌డంలో తీసుకురావ‌డంలో వీరు ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు అని విమ‌ర్శించారు.
 
వెంకయ్యనాయుడు తలుచుకుంటే ప్రధాని మోదీతో మాట్లాడి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే మీనమేషాలను ఎందుకు లెక్కిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. విశ్వసనీయత కు జగన్‌మోహన్‌రెడ్డి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలోని టీడీపీ ఎంపీలకు ఫోన్‌ చేసి నాటకాల కా ర్యక్రమం ముగిసిపోయిందని, ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభిస్తామని చెప్పారు..
 
అమరావతికి రమ్మని చెప్పారని అందుకే ఇక్క‌డ ఈ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు అని అన్నారు. రాజీనామాలు చేయ‌కుండా కేంద్రం పై ఒత్తిడి తీసుకురాకుండా ఎండ‌లో నిల‌బ‌డ‌దాం, షూలు వేసుకుని రెండు గంట‌లు పాద‌యాత్ర చేద్దాం, చెవులో పువ్వులు పెట్టుకుందాం, సైకిల్ తొక్కి న‌ర‌స‌న తెలియ‌చేద్దాం అంటే ప్ర‌త్యేక హూదా ఎలా వ‌స్తుంది అని విమ‌ర్శించారు.
 
ఇక చంద్ర‌బాబు నుంచి ప్ర‌జ‌లు మంచి త‌నం నేర్చుకోవాలి అని చెబుతున్నారు? అస‌లు ఆయ‌న  ఏం మంచి చేశారు, ప్ర‌జ‌ల‌ను వంచించ‌డం, వెన్నుపోటు పొడ‌వ‌డం, అవినీతి, అక్ర‌మార్కుల‌ను ప‌క్క‌న పెట్టుకోవ‌డం, ఫిరాయింపులు, 18 స్టేలు, ఇవేనా ప్ర‌జ‌లు ఆయ‌న నుంచి నేర్చుకోవ‌ల‌సిన అంశాలు.. మంత్రి లోకేశ్ దీనిపై కాస్త వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంది అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.