ఎల్లో మీడియాను దుమ్ముదులిపిన ప్ర‌శాంత్ కిషోర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

prashanth kishor
Updated:  2018-09-10 12:54:50

ఎల్లో మీడియాను దుమ్ముదులిపిన ప్ర‌శాంత్ కిషోర్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డికి ఎన్నిక‌ల వ్యూహక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ కి సుమారు 300 నుంచి 400 కోట్లు ఇచ్చారని ఎల్లో మీడియా నాయ‌కులు ప్రచారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా కిషోర్ ఈ వార్త‌ల‌పై స్పందించారు. హైద‌రాబాద్ లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జ‌రిగిన లీడ‌ర్ షిప్ లో పాల్గొని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. 
 
త‌మ‌ కంపెని చాలా కాలంగా ఆర్థిక వ‌న‌రుల‌తో ఇబ్బంది ప‌డుతుంటే కొంత మంది మీడియా నాయ‌కులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దగ్గ‌ర తాము అధిక మొత్తంలో డ‌బ్బులు తీసుకున్నామ‌ని ప్ర‌చారం చెయ్య‌డం మంచిది కాద‌ని ప్ర‌శాంత్ కిషోర్ వార్నింగ్ ఇచ్చారు. 
 
త‌న‌పై త‌న కంపెనీపై వస్తున్న వార్త‌ల పుకార్ల‌ల‌లో ఏమాత్రం వాస్త‌వం లేద‌ని అన్నారు. జ‌గ‌న్ త‌న‌కు అంత మొత్తంలో డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. పంజాబ్, బీహార్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన వేళ, అటు అమ‌ర‌రేంద‌ర్ సింగ్, ఇటు నితీష్ కుమార్ ల వ‌ద్ద ఎన్నిక‌ల ఖ‌ర్చున‌కు స‌రిప‌డ నిధులు లేవ‌ని ప్ర‌శాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
 

<