షాకింగ్... జగ‌న్ కేసులో స్పీడ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 01:30:49

షాకింగ్... జగ‌న్ కేసులో స్పీడ్

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు అంద‌రిలో ఆస‌క్తి రేపుతున్నాయి. ఓ వైపు రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై పార్టీల‌న్ని కేంద్రంపై యుద్దం ప్ర‌క‌టించాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న క్ర‌మంలో ప్ర‌జ‌ల్లో సింప‌తిని కొట్టేసేందుకు ఇదే అదునుగా  పార్టీల‌న్ని సిద్ద‌మ‌య్యాయి. 
 
ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌దైన రాజ‌కీయ వ్యూహ ర‌చ‌న‌ల‌తో ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జ‌గ‌న్ పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణలో స్పీడ్ పెంచ‌డంలో ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌కర్త ప్ర‌శాంత్ కిషోర్ హ‌స్తం ఉంద‌నే వార్త ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 
 
క‌క్ష్య సాధింపులో భాగంగానే జ‌గ‌న్ పై కేసులు వేశార‌న్న విష‌యాన్ని స్వ‌యంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లే  ఒప్పుకున్నారు. అంతేకాదు ఈ కేసులు నిల‌బ‌డ‌వ‌ని కూడా ప‌లువురు  సీనియ‌ర్ న్యాయ‌వాదులు, ఐఏఎస్ అధికారులు కూడా అనేక సార్లు తెలిపారు. దీంతో ఈ కేసులు నిల‌బ‌డ‌వ‌ని స్పష్టంగా తెలుస్తోంది. 
 
దీంతో  ఈ కేసుల విచార‌ణ స్పీడుగా జ‌రిపితే జ‌గ‌న్ నిర్ధోషి అని తేల్చే అవ‌కాశం ఉంద‌ని, అందుకే ప్ర‌శాంత్ కిషోర్ త‌న‌కున్న ప‌లుకుబ‌డితో జ‌గ‌న్ కేసుల విష‌యంపై ప్రత్యేక దృష్టి సారించారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌శాంత్ కిషోర్ ప్లాన్ ప్ర‌కారం నిజంగానే కేసుల విష‌యంలో పురోగ‌తి వ‌స్తే ఇక రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత వేగంగా మారే అవ‌కాశం ఉంది.. లాజిక‌ల్ గా ఆలోచిస్తే నిజమే అయినా కూడా ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

షేర్ :

Comments

1 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.