ప్ర‌శాంత్ కిషోర్ కొత్త స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 10:26:54

ప్ర‌శాంత్ కిషోర్ కొత్త స‌ర్వే

ఐదు జిల్లాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన పాద‌యాత్ర‌కు అశేష జ‌న‌సంద్రోహం వ‌చ్చింది.. ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్ కు మిక్కిలి ఆద‌ర‌ణ ల‌భించింది అన‌డంలో, అవాస్త‌వం లేదు.. అయితే తెలుగుదేశం నాయ‌కులు చేసే కామెంట్లు వారు చేసే ఆరోప‌ణ‌లు జ‌నంలేరు అనే ప్ర‌గ‌ల్బాల‌కు ఫుల్ స్టాప్ పెడుతున్నారు జ‌గ‌న్... జ‌న స‌మూహాల‌ను చూస్తుంటే ఎవరైనా జ‌గ‌న్ పాద‌యాత్ర స‌క్సెస్ అనే చెబుతారు.
 
ఇక గ‌డిచిన 15 రోజుల్లో ఏపీ రాజ‌కీయాలు మ‌రింత మార్పులు చోటు చేసుకున్నాయి.. నాయ‌కుల ఆలోచ‌నా ధోర‌ణిలో కూడా మార్పు వ‌చ్చింది. ఇటు కేంద్రంతో చంద్ర‌బాబు రాజీకి వ‌చ్చారా లేదా కేంద్రంతో వార్ కు దిగుతున్నారా అనే డైల‌మా ఉంది ప్ర‌జ‌ల్లో.. ఇక జ‌గ‌న్ ఏకంగా అవిశ్వాస తీర్మాణం అంటూ స‌రికొత్త సవాల్ చేశారు. ఇక జ‌న‌సేన క‌మిటి అంటూ కొత్త రాగం తీసుకుంది..  బీజేపీ రాయ‌ల‌సీమ అభివృద్ది అంటూ డిక్ల‌రేష‌న్ ఇచ్చింది. సో ఇక్క‌డ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.
 
తాజాగా ప్ర‌కాంత్ కిషోర్ ఏపిలో 13 జిల్లాల్లో స‌ర్వే నిర్వ‌హించార‌ట‌.. మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయం తీసుకున్నార‌ట‌.. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ స‌ర్వే నిర్వ‌హించారు అని తెలుస్తోంది....ఒక్కో సెగ్మెంట్ నుంచి 500 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ రిపోర్ట్ మొత్తం వడపోస్తే వచ్చిన రిజల్ట్ చూసి షాక్ అయ్యారట..మొత్తం 175 స్థానాల్లో 110 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు తేలింద‌ని తెలుస్తోంది. 
 
ముఖ్యంగా ప్రత్యేక హోదా, అవిశ్వాసం తీర్మానం పెడతాం అన్న జగన్ ప్రకటనతో మైలేజీ బాగా పెరిగింది అంట. అంతే కాదు.. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్ మళ్లీ ఎత్తుకోవటం అంటే.. మోసం చేయటమే అని జనం అనుకుంటున్నారట‌.
 
బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉన్నా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉన్నంత డ్యామేజ్ అయితే ఏమీ లేదని స్పష్టం అయ్యిందట. బీజేపీ ఎదురుదాడితో టీడీపీకే మైనస్ అవుతుందని.. లెక్కలు చెబుతుండటంతోపాటు బీజేపీకి, కేంద్రానికి చంద్రబాబు ఎలా దాసోహం అయ్యాడో బీజేపీ పల్లెపల్లెకి తీసుకెళుతుందని.. ఇక తెలుగుదేశం ప్ర‌త్యేక హూదాకు పాతర వేసింద‌ని అందుకే, వైసీపీ నాయ‌కులు కూడా ప్ర‌త్యేక హూదా కోసం పోరాడుతున్నారు అనేది బ‌లంగా వెళ్లింది అంటున్నారు నాయ‌కులు.. అందుకే వైసీపీకి ప్ర‌జ‌ల్లో ఈ 15 రోజుల్లో 12 శాతం గ్రాఫ్ పెరిగింది అని, తాజా స‌ర్వే తెలుపుతోంది. ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర కూడా అందుకే విశేష జ‌న‌స‌మూహాంతో ముందుకు క‌దులుతోంది.

షేర్ :

Comments

3 Comment

  1. Jock super

    అయినా మనం జాగ్రత్తగా ఉండాలి

    Yes

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.