పీకే టీం రెండు ప్ర‌శ్న‌ల‌తో కొత్త స‌ర్వే ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-30 17:34:03

పీకే టీం రెండు ప్ర‌శ్న‌ల‌తో కొత్త స‌ర్వే ?

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఊహించ‌నంత విధంగా  మార్పు చెంద‌డానికి ప్ర‌ధాన కార‌ణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గ‌త ఎన్నిక‌ల్లో కూత వేటు దూరంలో అధికారం కోల్పోయిన వైసీపీ, ఏ మాత్రం చింతించకుండా  విశ్వాసంతో ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డింది.ప్ర‌జ‌లిచ్చిన బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తూ,అసెంబ్లీలో అధికార తెలుగుదేశం పార్టీకి ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తోంది వైసీపీ. ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు చేసే అక్ర‌మాలను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తూ ప్ర‌జ‌ల్లో  భారీ ఆద‌ర‌ణ‌ను సంపాదించింది.
 
రాష్ట్రానికి విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక‌హోదా సాధించుకోవ‌డంలో టీడీపీ ఘోరంగా వైఫ‌ల్యం చెందితే కేంద్రాన్ని ఎదిరించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పోరాటం చేసింది. రాష్ట్ర‌వ్యాప్తంగా యువ భేరిలు, దీక్ష‌లు, క‌లెక్ట‌రేట్ ముట్ట‌డులు, రాస్తారోకోలు లాంటి కార్య‌క్ర‌మాలు చేసి ప్ర‌జాక్షేత్రంలో దూసుకుపోతోంది వైసీపీ. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి న‌వంబర్ 6న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టారు వైయ‌స్ జ‌గ‌న్‌. 
 
వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్రకు ప్ర‌జ‌లు పెద్దెత్తున బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు వైయ‌స్ జ‌గ‌న్‌. అదే విధంగా గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా అధికార టీడీపీ చేస్తున్న అవినీతిని, అక్ర‌మాల‌ను ప్ర‌జా క్షేత్రంలో ఎండ‌గ‌డుతున్నారు.ఇది చూసిన ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో  వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతారంటూ నినాదాలు చేస్తున్నారు.
 
ఏపీకు ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ కేంద్రం పై మొద‌ట అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విష‌యం తెలిసిందే.పార్ల‌మెంట్ చివ‌రి రోజు వ‌ర‌కు, లేక‌పోతే పార్ల‌మెంట్ నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన‌ప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాల‌నిజ‌గ‌న్ ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఇన్ని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా  పీకేటీం తాజాగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వే చేయించార‌ట‌. దీనిలో ఊహించ‌ని ఫ‌లితాలు వెల్ల‌డైన‌ట్లు తెలుస్తోంది.
 
ఈ స‌ర్వే కేవ‌లం రెండు ప్ర‌శ్న‌ల మీదే జ‌రిపార‌ట‌. 1. వైయ‌స్ జ‌గ‌న్ ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాలు స‌రైన‌వేనా ? 2. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తుందా ?  దీనిలో వైయ‌స్ జ‌గ‌న్ ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాలు స‌రైన‌వేనా అన్న ప్ర‌శ్న‌కు 80 శాతం మంది ప్ర‌జ‌లు క‌రెక్ట్ అని స‌మాధానం ఇచ్చార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.