బాబుగారి కోట‌లో వైసీపీ జెండా ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 16:45:11

బాబుగారి కోట‌లో వైసీపీ జెండా ఫిక్స్

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ స్వ‌ల్ప మెజారిటీతో అధికారాన్ని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఇక వ‌చ్చే ఎన్నికల్లో ఖ‌చ్చితంగా అధికారంలోకి రావాల‌నే ఉద్దేశ్యంతో ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం అడుగులు వేస్తున్నారు జ‌గ‌న్. ఇక‌ ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఏం చేయలేని ప‌రిస్థితిలో ఉన్నారు.
 
గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ దూకుడు చూసి ఆయ‌న వీక్నెస్ ను టీడీపీ నాయ‌కులు ప‌ట్ట‌కుని అధికారంలోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ జ‌గ‌న్ తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు ఏ మాత్రం ద‌క్కనివ్వ‌ట్లేదు. పార్టీ త‌ర‌పున ఏ కార్య‌క్ర‌మానికి స్వీకారం చుట్టాల‌నుకున్నా కానీ పార్టీ నాయ‌కుల స‌ల‌హాలు తీసుకుని అడుగు వేస్తున్నారు జ‌గ‌న్.
 
ఇక ఈ ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ కూడా సర్వే నిర్వ‌హించారు. మొద‌టిగా ప్ర‌శాంత్ టీమ్ గ‌త ఎన్నికల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గ‌ల్లంతైన ప్ర‌తీ చోట స‌ర్వే చేప‌ట్టింది. ఈ స‌ర్వేలో వైసీపీ అభ్య‌ర్థులు ఓట‌మికి గ‌త కార‌ణాల‌ను, విశ్లేషించుకుంటూ గెలుపుకు గ‌ల కార‌ణాల‌ను తెలుసుకుంటోంది. అయితే మెద‌టిగా తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అనంత‌పురం జిల్లా లో స‌ర్వేను నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ప‌లు కీల‌క ఆధారాలు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.
 
ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, అలాగే రెండు పార్ల‌మెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల‌ను టీడీడీ కైవ‌సం చేసుకోగా, కేవ‌లం రెండు స్థానాల‌ను మాత్ర‌మే వైసీపీకి ద‌క్కాయి. ఇక రెండు ఎంపీ స్థానాలు ఉంటే ఆ రెండు స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. అనంత‌లో వైసీపీ త‌ర‌పున గెలిచిన ఇద్ద‌రిలో ఒక‌రు అధికార నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి టీడీపీ పార్టీలోకి చేరారు. దీంతో  ఈ జిల్లా నుంచి ఒక్క‌రు మాత్ర‌మే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
 
ఇక ఈ జిల్లాలో ఎలాగైనా ప‌ట్టు సాధించి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 14 స్థానాల్లో 12 స్థానాల‌ను గెలిచి వైసీపీ జెండానే పాతేందుకు వ్యుహ‌లు ర‌చిస్తోన్నారు.అలాగే ఈ జిల్లాకు సంబంధించి అభ్య‌ర్థుల‌ను కూడా రెడీ చేయ‌నున్నారు. ఆర్థికంగా సామాజికంగా, ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న వ్య‌క్తుల‌ను వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేయించాల‌ని పార్టీ పెద్ద‌లు ఆలోచిస్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించి అభ్య‌ర్థుల పేర్ల‌ను కూడా త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంద‌ని స‌మాచారం.
 
ఇక మ‌రోవైపు  తెలుగు దేశంపార్టీ నాయ‌కుల అత్యంత స‌న్నిహిత వ‌ర్గం ఈ జిల్లాలో స‌ర్వే నిర్వ‌హించింది. ఈ సర్వేలో తెలిసిన విష‌యాల‌ను చూసి చంద్ర‌బాబు  షాక్ తిన్నార‌ట‌. ఎన్టీఆర్ హ‌యాం నుంచి నేటి వ‌ర‌కూ టీడీపీకి కంట‌చుకోట‌గా వ‌స్తున్న ఈ జిల్లాలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైసీపీకి 12 నుంచి 13 స్థానాలు వ‌చ్చే ఛాన్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఈ సర్వేలో తేలింది. దీంతో చంద్ర‌బాబు నాయుడు అనంత ఎంపీ ఎమ్మెల్యేల‌ను వెంట‌నే అమ‌రావ‌తికి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు. మొత్తానికి అనంత‌లో టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.