ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది వైసీపీ కోసమా? లేక టీడీపీ కోసమా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

prashanth kishor team
Updated:  2018-06-30 18:23:53

ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది వైసీపీ కోసమా? లేక టీడీపీ కోసమా?

ఒక వైపు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర అంటూ గత 200 రోజుల నుంచి ప్రజలలో తిరుగుతూ ప్రజలలో మనో ధైర్యాన్ని నింపుతూ, కార్యకర్తలకి భరోసా ఇస్తూ ముందుకు సాగుతుంటే మరోవైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు గాను కార్యకర్తలకి తగిన శిక్షణ, నాయకులకి తగిన దిశానిర్దేశం ఇవ్వడంలో ప్రశాంత్ కిషోర్ టీం వెనుకబడిందని పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
 
గత ఎన్నికల్లో కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని దూరం చేసుకున్న వైసీపీ  2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీంని నమ్ముకుని విజయం సాధించగలదా..?  న్యూట్రల్ ఓటర్లని ప్రభావితం చేయగల సోషల్ మీడియాని ముందుకు నడిపించాల్సిన బాధ్యతని ప్రశాంత్ కిషోర్ టీం విస్మరిస్తూ వస్తోందని అనుకుంటున్నారు విశ్లేషకులు...
 
ప్రశాంత్ కిషోర్ టీం ఏం సాధించింది..? 
 
కోట్ల రూపాయల ఖర్చుపెట్టి జగన్ నియమించుకున్న స్ట్రాటెజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఏమైనా సాధించారా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. నార్త్ పాలిటిక్స్ వేరు, సౌత్ లోని ఆంధ్ర పాలిటిక్స్ వేరు. చంద్రబాబు లాంటి మేధావిని ఎదుర్కొనాలంటే డబ్బుతో పాటు మీడియా బలం కూడా చాలా అవసరం. చంద్రబాబుని ఢీ కొట్టడం అంత సుల‌భం కాద‌ని ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికైనా గ్రహించిందో లేదో తెలియదు కానీ వైసీపీకి ఆయువు పట్టులాంటి సోషల్ మీడియా మరియు వెబ్ మీడియాని గుర్తించడంలో మాత్రం విఫలం అయ్యారు అని తెలుస్తుంది. 
 
ఇటీవల కాలంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని యూట్యూబ్ చానెల్స్ పైన టీడీపీకి చెందిన మీడియా సంస్థ "copyrightmedia2012" దండయాత్ర మొదలుపెట్టింది. యూట్యూబ్ లో కానీ, ఫేస్ బుక్ లో కానీ లోకేష్ కి మరియు చంద్రబాబుకి వ్యతిరేకంగా కథనాలు వస్తే  వెంటనే వాటిని తొలగించేయమని టీడీపీకి చెందిన ఆ మీడియా సంస్థ హుకుం జారీ చేస్తుంది...
 
అలా చేయని యెడల ఫేస్ బుక్ పేజీ అయితే రిపోర్ట్ చేసి పేజీ డిలీట్ అయ్యేలా మరియు యూట్యూబ్ అయితే స్ట్రైక్ ఇచ్చేలా చేస్తుంది. ఒక యూట్యూబ్ ఛానల్ కి 90 రోజుల వ్యవధిలో మూడు స్ట్రైక్ లు గాని వచ్చినట్లయితే ఆ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఇటీవల కాలంలో వైసీపీ కి ఆయువుపట్టులాంటి జనహితం టీవీ, అస్త్రం టీవీ, ఆద్య మీడియా, నిజం మీడియా, పొలిటికల్ బెంచ్ లాంటి యూట్యూబ్ చానెల్స్ కి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి...పార్టీ పరంగా కానీ, ప్రశాంత్ కిషోర్ టీం నుండి కానీ ఎటువంటి సహాయము అందలేదు...దానికి తోడు చంద్రబాబు తప్పులని ఎత్తి చూపకండి...న్యూట్రల్ గా రాయండి అని ఉచిత సలహా కూడా ఇచ్చిందట ఈ ప్రశాంత్ కిషోర్ టీం.
 
ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ టీం మైంటైన్ చేస్తున్న వైసీపీ పేజీని కూడా "copyrightmedia2012" బ్లాక్ చేసినట్టు సమాచారం...అయినా కూడా ప్రశాంత్ కిషోర్ టీం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని సమాచారం..."copyrightmedia2012" సంస్థ వైసీపీకి సపోర్ట్ గా స్వచ్ఛందంగా నడుపుతున్న యూట్యూబ్, పేస్ బుక్ పేజీలపై దాడి చేస్తున్న దానిని అరికట్టేందుకు ప్రశాంత్ కిషోర్ టీం ఎటువంటి అడుగులు వేయడం లేదని, అసలు ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది వైసీపీ కోసమేనా అని సదరు యూట్యూబ్, పేస్ బుక్ పేజీలు మైంటైన్ చేస్తున్న వారు వాపోతున్నారు...ఇది ఇలాగే కొనసాగితే మరో రెండు నెలల్లో వైసీపీకి సంబందించిన పేజీలు, యూట్యూబ్ ఛానళ్ళు మాయమవడం ఖాయం...
 
ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏమి జగన్ మీద ప్రేమతోనే లేక చంద్రబాబు మీద పగతోనో పని చేయరు. ఇవాళ జగన్ డబ్బు ఇచ్చారు కాబట్టి జగన్ కోసం పనిచేస్తున్నారు. రేపు 2019 లోచంద్రబాబు ఓడిపోయి జగన్ కంటే ఎక్కువ డబ్బు ఇస్తే టీడీపీ కోసం పనిచేస్తారు. సంస్థాగతంగా టీడీపీకి ఉన్న బలం వైసీపీకి లేదనే చెప్పాలి. పార్టీ అధినేత వైస్ జగన్, ప్రశాంత్ కిషోర్ ని నియమించుకోవడానికి గల కారణం సంస్థాగతంగా వైసీపీని బలోపేతం చేయడం కోసం మరియు నాయకులకి దిశానిర్దేశం చేస్తూ గెలుపే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తే కానీ 2019 లో వైసీపీకి అధికారం దక్కదు. కానీ అటువైపు అడుగులు పడుతున్నట్లు కనిపించడం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.