జ‌గ‌న్ కు సూచ‌న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 17:42:35

జ‌గ‌న్ కు సూచ‌న‌

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌కు ప్ర‌ముఖ  రాజ‌కీయ వ్యూహక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌లను బాగానే ఉప‌యోగించుకుంటున్నారా?  చాయ్ పే చ‌ర్చా నుంచి ఫేమ‌స్ అయిన ప్ర‌శాంత్ కిషోర్ మోదీని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిని చేశారు.. అదే ఫార్మూలాతో నితిష్ ను బీహార్ ముఖ్య‌మంత్రిని చేశారు.. ఇక కాంగ్రెస్ కు సాయం చేసినా ప్ర‌శాంత్ టీం క‌ష్ట‌ప‌డినా బీజేపీ హావా ముందు కొట్టుకుపోయింది యూపీలో.... అయితే ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ కు జ‌నం నుంచి అభిమానం మ‌ద్ద‌తు విప‌రీతంగా పెరుగుతోంది.. టీడీప డ్యాష్ బోర్డు కూడా ఆశ్చ‌ర్య‌పోయే రేంజ్ లో ఉంది ఆ జ‌న‌స‌మూహా అభిమానం.
 
అయితే ప్ర‌శాంత్ కిషోర్ టీం చేసే స‌ర్వేలు ఇచ్చే నిర్ణ‌యాలు రాజ‌కీయ వ్యూహాలు నార్త్ సైడ్ రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌ని చేస్తాయి అని, అవి ద‌క్షిణాది రాజ‌కీయాల‌పై అంత ప్ర‌భావం చూప‌వు అంటారు..అయితే జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల వెనుక ప్ర‌శాంత్ టీం స‌లహా ఉంది అంటారు... వారి సూచ‌న ఉంది అని చ‌ర్చించుకుంటారు...ఇది ఎంత వ‌ర‌కూ నిజం అనేది చాలా మందికి  తెలియ‌ని అంశం... అయితే ప్ర‌శాంత్ టీం సల‌హా ఇచ్చింది.. అలాగే ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేసింది. అది ఆచ‌ర‌ణ యోగ్య‌మా కాదా ? అమ‌లు చేయ‌గ‌ల‌మా లేదా అనేది ప్ర‌శాంత్ టీం ఇచ్చిన స‌ల‌హాల మేర‌కు ఆర్దిక నిపుణుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత జ‌గ‌న్  నిర్ణ‌యం తీసుకున్నారు.
 
బీహార్ లో ప్ర‌ధాని ల‌క్ష కోట్ల ప్యాకేజీ అక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఆఫ‌ర్ చేసినా ఓట్లు రాల‌లేదు... ఇదే ఇక్క‌డ గ‌మ‌నించాలి.. ఓట రు నాడి ప‌ట్టుకోవాలి... అక్క‌డ రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకునేది ఏమిటి?   వారికి అవ‌స‌రాలు  ఏమిటి? అధికార‌పార్టీలు గుర్తించ‌న‌వి విష‌యాలు స‌మ‌స్య‌లు ఏమిటి? ఏ నాటి నుంచో తిష్టవేసిన స‌మ‌స్య‌ల మూలాలు తెలుసుకోవాలి? ఇక్క‌డ రాజ‌కీయంగా ఆలోచించ‌కూడ‌దు, అక్క‌డ సేవాత‌త్వంలో ఆలోచించాలి.. అది ఇక్క‌డ జ‌గ‌న్ కోట‌రిలో ఉండే నాయ‌కులు కూడా ఆలోచించారు. ప్ర‌శాంత్ టీం అదే విధానంలో ఆలోచించారు.
 
సైకిల్లు ల్యాప్ ట్యాప్ లు సెల్ ఫోన్లు ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలుసు... అమ‌లుకాని హామీలు గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన హ‌మీలు ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు... ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేదు చంద్ర‌బాబు.. అందుకే ఇటువంటివి కాకుండా ప్రజొప‌యోగ ప‌థ‌కాలు  ప్ర‌శాంత్ టీం ఆలోచించి జ‌గ‌న్ టీంతో క‌లిసి ప్ర‌జ‌ల‌ను క‌లిసి తీసుకుంది.
 
అందులో భాగంగానే ప్ర‌శాంత్ టీమ్ కూడా ఏపీ రాజ‌కీయాలు ఇక్క‌డ ప్ర‌జా స‌మ‌స్య‌లు ఆలోచించి... ప్ర‌జ‌ల నీడ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున జ‌గ‌న్ కు స‌లహా ఇచ్చారు... అయితే ఇది అమ‌లు చేయగ‌ల‌మా లేదా అనేది వారి బ‌డ్జెట్ పై ఆధార‌ప‌డి ఉంటుంది.. ఇవ‌న్నీ ఆలోచించి ఆర్దిక నిపుణుల‌తో స‌ల‌హాలు తీసుకుని ప్యూచర్ ఎస్టిమేష‌న్లు. బ‌డ్జెట్ లెక్క‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చారు... ఐదేళ్ల అధికారం అంటే ప‌దిల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మీద పెత్త‌నం మాత్ర‌మే కాదు, ప్ర‌జల న‌మ్మ‌కం కూడా అనేది తెలుసుకోవాలి?
 
వ‌చ్చిన ప్ర‌తీ రూపాయిస‌రి అయిన క్ర‌మంలో ఖ‌ర్చుపెడితే, న‌వ‌ర‌త్నాలు ఏమిది  వంద న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు అయినా ప్ర‌వేశ‌పెట్ట‌వ‌చ్చు అనేది వైసీపీ వాద‌న... తండ్రి మాదిరే కుమారుడు జ‌గ‌న్ ఇచ్చిన హామీని త‌ప్ప‌క నెర‌వేరుస్తాడు... మాట ఇస్తే దాట‌డు అనే పేరు సంపాదించుకున్నారు జ‌గ‌న్... అందుకే జ‌గ‌న్ పై ఈ న‌వ‌ర‌త్నాల ఎఫెక్ట్ చూపించ‌నున్నాయి. 
 
నోటి మాట పోస్ట‌ర్ లో రాత కాదు.... నిజంగా  న‌వ‌ర‌త్నాలు అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేస్తాము అని  వైసీపీ ప‌ల్లె ప‌ల్లెలో ఇంటి ఇంటికి తెలియ‌చేస్తోంది.. నిజంగా అమ‌లు చేస్తే జ‌గ‌న్ కు తిరుగుఉండ‌దు... అలాగే ఇలా ర‌త్నాలు అమ‌లు చేస్తూ రాజ‌ధానిని నిర్మించాలి.... సీఎం చంద్ర‌బాబు చెప్పే 100 దేశాల త‌రహా కాక‌పోయినా మ‌న ప‌రిపాల‌న‌కు  త‌గ్గ‌ట్లు ఉంటే చాలు అనేది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌..
 
విశ్లేష‌ణ !! గణేష్ .వి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.