ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-12 16:38:16

ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ

తూర్పుగోదావ‌రి జిల్లా తెలుగుదేశంలో ఐదు సెగ్మెంట్ల‌లో ఇప్ప‌టికే వ‌ర్గ విభేదాలు తారాస్ధాయికి  చేరాయి... ఇక జిల్లాలోని ప్ర‌త్తిపాడు సెగ్మెంట్లోని టీడీపీలో విభేదాలు తీవ్ర‌రూపం దాల్చాయి. ఇక్క‌డ నాయ‌కులు నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ కు వెళ్లిపోయారు....పార్టీలోకి వచ్చి తమను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై టీడీపీలో తొలినుంచీ ఉంటూ వస్తున్నవారు భగ్గుమంటున్నారు.  పార్టీలో సీనియ‌ర్ గా మేము ఉన్నాం పార్టీ ఫిరాయించి మా పైపెత్త‌నం ఏమిటి అని వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
ఈ  సెగ్మెంట్లో  ప‌ర్వ‌త చిట్టిబాబు వ‌ర్గం  ఫిరాయించిన ఎమ్మెల్యే వ‌ర్గం పై ముందు నుంచి కాస్త గుర్రుగానే ఉన్నారు.. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌పై గెలిచి ఇప్పుడు పార్టీ ఫిరాయించి ఇప్పుడు మ‌ళ్లీ పెత్త‌నం చెలాయించాలి అనుకుంటే తాము ఊరుకోము అని వారు హెచ్చ‌రిస్తున్నారు.. ఇక్క‌డ ప‌ర్వ‌త చిట్టిబాబు వ‌ర్గం సుబ్బారావు వ‌ర్గం మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.
 
ఇక ప్ర‌త్తిపాడు సెగ్మెంట్లో పార్టీ ఫిరాయించిన సుబ్బారావు కాపు నాయ‌కుల‌పై అణిచివేత దోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని... వరుపుల సుబ్బారావు పై జిల్లాలో మంత్రుల‌కు సీఎంకు కూడా ఫిర్యాదు చేశారు చిట్టాబాబు వ‌ర్గం.... ఇక్క‌డ వీరి మ‌ధ్య ఆదిప‌త్య పోరు మాత్రం మ‌రింత పెరుగుతూనే ఉంది...ఈ సెగ్మెంట్లో తాజాగా టీడీపీ అట్టహాసంగా చేపడతున్న పింఛన్ల పంపిణీలో తాజాగా తెలుగుదేశంలో అసమ్మతి బుసకొట్టింది. 
 
కొత్త పింఛన్లు పంఫిణీ కార్యక్రమానికి  ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగతనేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు ఫొటోలను వేశారు. కానీ, అది ఎమ్మెల్యే వర్గీయులకు  రుచించలేదు. వెనకుండి ఎన్టీఆర్, చిట్టిబాబు ఫొటోలపై స్టిక్కర్లను అంటించేలా చేయించారని  పర్వత చిట్టిబాబు వర్గానికి చెందిన పలువురు తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే పనేనని, ఆయన చెబితేనే అధికారులు తొలగించారని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
 
ఎమ్మెల్యే తీరుతో విభేదిస్తున్న పర్వత చిట్టిబాబు వర్గీయుల తమ నాయకులకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు ఆందోళ‌న చేప‌ట్టారు.దీనిపై స‌మాధానం చెప్పాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.. మొత్తానికి ఫిరాయింపు సెగ్మెంట్ల‌లో తెలుగుదేశం వెలిగిపోతోంది అన‌డానికి ఈ ఘ‌ట‌న మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.