అశోక్ గజపతి రాజు శాఖను భ‌ర్తీ చేసిన కేంద్రం..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ashok gajapathi raju image
Updated:  2018-03-10 04:51:24

అశోక్ గజపతి రాజు శాఖను భ‌ర్తీ చేసిన కేంద్రం..?

ఏపీ నుంచి కేంద్రంలో మంత్రులుగా కొన‌సాగుతున్న ఇద్ద‌రు తెలుగుదేశం ఎంపీలు కేబినెట్ నుంచి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు.. అయితే తెలుగుదేశం మాత్రం ఎన్డీఏలో కొన‌సాగుతోంది. ఇక కేంద్రంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌శంస‌లు అందుకున్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు త‌మ ప‌ద‌వికి రాజీనామా చేయ‌గానే ఆ ప‌దవి  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ద‌గ్గ‌రే కేటాయించుకుంటారు అని అనుకున్నారు.. అయితే విమాన‌యాన శాఖ‌ను సురేష్ ప్రభుకు అదనపు బాధ్యతగా అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
 
నరేంద్రమోదీ కేబినెట్‌లో సురేష్ ప్రభు ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు విమానయానశాఖ బాధ్యతలు అదనంగా అప్పగించారు. గత ఏడాది జరిగిన కేబినెట్ విస్తరణలో జరిగిన శాఖలో మార్పులలో సురేష్ ప్రభును రైల్వే శాఖ నుంచి వాణిజ్య, పరిశ్రమల శాఖకు మార్చిన విషయం విధితమే.
 
ఇటు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం కేబినెట్ నుంచి ఇద్ద‌రు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ఆ ఇరువురి మంత్రి ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌నున్నారు అని తెలుస్తోంది. ఇటు కేంద్రంలో సుజ‌నాచౌద‌రి, అశోక్ గ‌జ‌ప‌తిరాజు... రాష్ట్రంలో కామినేని శ్రీనివాస్ పైడికొండ‌ల మాణిక్యాల‌రావు లు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.