లోక్ స‌భ‌లో ప్ర‌ధాని విసుర్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 01:59:50

లోక్ స‌భ‌లో ప్ర‌ధాని విసుర్లు

పార్లమెంట్లో తెలుగుదేశం వైసీపీ కాంగ్రెస్ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాల‌ని ప్లకార్డుల‌తో నిర‌స‌న తెలియ‌చేశారు. ఇక రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపిన ప్ర‌దాని న‌రేంద్ర‌మోదీ  ఏపీ గురించి ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు..
 
తెలంగాణ ఏర్పాటుకు ఆనాడు మ‌ద్ద‌తు ఇచ్చాం అని తెలిపారు మోదీ.. కాంగ్రెస్ హడావిడిగా రాష్ట్రాన్ని విభ‌జించింది అని అన్నారు..కాంగ్రెస్ విభ‌జ‌న వల్లే ఇటువంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని అన్నారు ఆయ‌న‌..టీడీపీ ఎంపీల ఆందోళ‌న‌పై  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మాట్లాడ‌లేదు.
 
ఏపీని అన్నివిధాలుగా ఆదుకుంటాం టీడీపీతో తాము కలిసి ప‌నిచేస్తున్నాం అన్నారు ప్ర‌ధాని మోదీ..స‌భా కార్య‌క్ర‌మాల‌ను ఎవ‌రు అడ్డుకోవాలి అని అనుకున్నా అది మంచి ప‌రిణామం కాదు, పార్ల‌మెంట్ కు  శ్రేయ‌స్క‌రం కాదు 
అన్నారు న‌రేంద్ర‌మోదీ.
 
రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని, ఎన్నిక‌లు వ‌స్తున్న స‌మ‌యంలో రాష్ట్రాల్లో చిచ్చు పెట్టింది అని అన్నారు మోదీ..గ‌తంలో మూడు కొత్త రాష్ట్రాల‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త ఎన్డీఏది అని అన్నారు మోదీ, ఆ స‌మ‌యంలో ఎవ‌రికి ఇవ్వాల్సిన‌వి వారికి ఇచ్చామ‌ని అందుకే ఎటువంటి ఇబ్బంది రాలేద‌ని అన్నారు ప్ర‌ధాని మోదీ
 
ఆ స‌మ‌యంలో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని రాష్రాల‌ను విభ‌జించామ‌ని, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు చూడ‌లేదు అన్నారు మోదీ.. పార్ల‌మెంట్ త‌లుపులు మూసి రాష్ట్రాన్ని విభ‌జించారు మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారా అని కాంగ్రెస్ ఎంపీల‌పై ఫైర్ అయ్యారు మోదీ..తెలుగుదేశం ఎంపీల‌కు తృణ‌ముల్ కాంగ్రెస్ ఎంపీలు స‌పోర్ట్ గా నినాదాలు చేశారు ఈ స‌మ‌యంలో మోదీ మ‌రింత ఫైర్ అయ్యారు.
 
హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో ఏపీ ద‌ళిత ముఖ్య‌మంత్రిని అప్ప‌ట్లో రాజీవ్ గాంధీ తీవ్రంగా అవ‌మానించారు...కాంగ్రెస్ చేసిన ప‌నికి తెలుగుదేశం పుట్టింది, తెలుగుదేశం కాంగ్రెస్ పై వ్య‌తిరేక‌త‌తో ఆత్మ‌గౌర‌వం కోసం పార్టీ పెట్టారు  ఆనాడు ఎన్టీఆర్ అని అన్నారు మోదీ..రాత్రికి రాత్రే సంజీవ రెడ్డిని  వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,  ఏపీలో అంజ‌య్య, పీవీ, నీలం సంజీవ‌రెడ్డి లాంటివారిని వెన్నుపోటు పొడిచిన పార్టీ మీది అని తీవ్ర‌స్దాయిలో కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ 
 
అద్బుత‌మైన విమాన‌యానం తెచ్చింది మేమే అన్నారు ప్రధాని న‌రేంద్ర‌మోదీ...  చిన్న ప‌ట్ట‌ణాల‌కు అద్బుత‌మైన విమానాశ్ర‌యాలు తీసుకుకొచ్చాం.దేశానికి రెక్క‌లు తొడిగాం. వార‌స‌త్వ రాజకీయాలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు ప్ర‌ధాని.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.