లోకేశ్ అక్క‌డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే క‌ష్ట‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-21 15:27:34

లోకేశ్ అక్క‌డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే క‌ష్ట‌మే

కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశంపార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలిచిన బోడె ప్ర‌సాద్ త‌ర‌చు వివాదాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుకు త‌వ్వ‌కాల ఆరోప‌ణ‌ల విష‌యంలో ప్ర‌సాద్ పై పెద్ద ఎత్తున వ్య‌తిరేకత‌ పెరిగింది. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ తో ఎమ్మెల్యే ప్ర‌సాద్ ఎప్ప‌టి నుంచో వీరిద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది.తాను ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నాయ‌కుడిగా ఎద‌గ‌లేద‌నే ఆలోచ‌నలో బోడె ప్ర‌సాద్ ఉన్నార‌ట‌. 
 
అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెనుమ‌లూరు నుంచి టీడీపీ త‌ర‌పున త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నా కానీ, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌ వారిని భ‌రిలోకి దింపేందుకు అధిష్టానం ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు  క‌నిపిస్తోంది. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న పెన‌మ‌లూరు నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ ను బ‌రిలో దింపుతార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది ఈ నియోజ‌క‌వ‌ర్గంలో. 
 
2009లో పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం అవిర్భవించాకా ఎమ్మెల్యేగా గెలిచిన పార్థ‌సార‌ధి మంత్రిగా ఐదు సంవ‌త్స‌రాల పాటు జిల్లాలో చ‌క్రం తిప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్ల‌మెంట్ స్థానానికి పోటీచేసిన ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురు అయింది. గ‌తంలో పెన‌మ‌లూరు నుంచి రెండు సార్లు గెలిచిన పార్థ‌సార‌ధి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా అక్క‌డి నుంచే పోటీ చేయ్యాల‌ని భావించారు.
 
బీసీ ఓట్లను టార్గెట్ చేసి వ‌చ్చే ఎన్నికల్లో గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడు క్యాడ‌ర్ వైసీపీలో ఉన్న ఓటు బ్యాంక్ తాను మంత్రిగా ఉన్న ప‌రిచ‌యాలు అప్ప‌ట్లో చేసిన అభివృద్ది దీంతో పాటు బీసీ ఓటు బ్యాంకు క‌లిసి వ‌స్తాయ‌ని పార్థసార‌ధి భావిస్తున్నారు. ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ మీద కాల్ మ‌ని సెక్స్ రాకెట్ ఆరోప‌న‌లు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేప‌టంతో  అది కూడా త‌న‌కు ప‌రోక్షంగా లాభిస్తాయ‌నే న‌మ్మ‌కంతో పార్థ‌సార‌ధి ఉన్నారు. అంతేక‌దు ఓసీ సామాజీక అండ‌దండ‌లు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కం కావ‌డంతో వారితో సంప్ర‌దింపులు మొద‌లు పెట్టారు.
 
ఇక‌ ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చేఎన్నిక‌ల్లో మంత్రి లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాల‌ని చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బ‌ట్టి చూస్తుంటే లోకేశ్ ఇక్క‌డ పోటీ చేస్తే గెల‌వ‌డం క‌ష్టాంగా మారుతాద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.