మొకం చాటేసిన టీడీపీ ఎంపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-22 11:11:54

మొకం చాటేసిన టీడీపీ ఎంపీ

తిత్లీ తుఫాను ప్ర‌భావానికి విజ‌యన‌గ‌రం జిల్లా, శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌ల‌ను అత‌లా కుత‌లం చేసి సుమారు 13 రోజులు కావ‌స్తున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఇంత‌వ‌ర‌కు ఎలాంటి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. దీంతో ప్ర‌జ‌లు పాలకుల‌పై గుర్రున ఉన్నారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వ‌చ్చిపోతున్న‌ టీడీపీ నాయ‌కులు తుఫాను బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌కుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే ఓట్లు వెయ్యాల‌ని ప్ర‌చారం చేయ‌డంతో ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. 
 
అయితే ఇదే క్ర‌మంలో టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు తుఫాన్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఇచ్చాపురంకు వెళ్తె ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. సుమారు 13 రోజులు అయినా త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయం అంద‌డం లేదంటూ రామ్మోహ‌న్ నాయుడును ప్ర‌జ‌లు నిలదీశారు. అయితే ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేసినా కూడా ప్ర‌జ‌లు సంతృప్తి చెంద‌లేదు. దీంతో చేసేది ఏంలేక ఆయ‌న అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. . 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు