ఆ ప‌ది మంది టీడీపీ మంత్రులు గెల‌వ‌డం క‌ష్టం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 17:40:05

ఆ ప‌ది మంది టీడీపీ మంత్రులు గెల‌వ‌డం క‌ష్టం

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అటు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు త‌మ నియోజ‌కవ‌ర్గాల్లో గెలుస్తామా లేదా అన్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
అయితే ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు ఈ భయం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. తెర‌ ముందు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్నా కానీ తెర‌వెనుక అధికారం గురించి ప‌క్క‌న పెడితే తాము త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుస్తామ‌నే న‌మ్మ‌కం కూడా కోల్పోతున్నారు టీడీపీ నాయ‌కులు.
 
ఇక తాజాగా టీడీపీ క్యాబినెట్ 23 మంది మంత్రుల‌పై ఓ సంస్థ‌కు చెందిన వారు కీల‌క స‌ర్వే నిర్వ‌హించారు. అయితే ఇందులో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, నారాలోకేశ్, నారాయ‌ణ‌లు ఎమ్మెల్సీలుగా కొన‌సాగుతున్నారు.ఇక వారిని మినహా ఇస్తే మిగిలిన 18 మంది మంత్రుల‌పై స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం వచ్చే ఎన్నిక‌ల్లో సుమారు ప‌దిమంది మంత్రులు ఓడిపోయే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని స‌ర్వే తెలిపింది.
 
ఈ ప‌దిమంది మంత్రులు వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తే వారి గెలుపుకు వైసీపీ, జ‌న‌సేన పార్టీలు అడ్డుగా మారుతున్నాయట‌. అందులో ముఖ్యంగా జ‌న‌సేన పార్టీ టీడీపీ లో ఓట్ల‌ను చీల్చుతుంద‌ని ఈ స‌ర్వే తెలిపింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌న ఓటు బ్యాంకింగ్ ను కాపాడుకుంటే స‌రిపోతుంద‌ని తెలిపింది.
 
ఈ స‌ర్వే ద్వారా టీడీపీ మంత్రుల కొన్ని పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి అందులో మొదిటిగా క‌ళా వెంక‌ట్రావు, పితాని స‌త్యనారాయ‌ణ‌, కొల్లు ర‌వీంద్ర‌, భూమా అఖిల‌ప్రియ‌, ఆదినారాయ‌ణ రెడ్డి,కేఈ కృష్ణ‌మూర్తి, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజప్ప‌, అయ్య‌న్న‌పాత్రుడుతో పాటు మ‌రో మంత్రి కూడా ఉన్నార‌ని తెలిపింది. వీరంద‌రి పై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నార‌ని తెలిపింది. 
 
టీడీపీ అధికారంలో మంత్రి ప‌ద‌వుల‌ను అనుభ‌విస్తున్నారు త‌ప్ప ఇంత వ‌ర‌కు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం కూడా చేయ‌లేద‌ని ఈ స‌ర్వే తెలిపింది. దీంతో ప్ర‌జలు టీడీపీ మంత్రుల‌కు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ది చెప్పేందుకు రెడీ అయ్యార‌ని ఈ స‌ర్వే తెలిపింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.