అర్ధ‌రాత్రి అమ‌రావ‌తిలో అరాచ‌కం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap farmers amaravathi iamge
Updated:  2018-02-26 10:58:35

అర్ధ‌రాత్రి అమ‌రావ‌తిలో అరాచ‌కం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో రైతుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. రైతుల‌కు ఇష్టం లేకుండా రాజ‌ధాని పేరుతో భూముల‌ను ప్ర‌భుత్వం లాక్కుంటోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికి తోడు రైతుల అనుమ‌తి లేకుండానే వారి భూముల్లో ప్ర‌భుత్వం ప‌లు నిర్మాణాలు చేపట్ట‌డం గ‌మ‌నార్హం...
 
వెల‌గ‌పుడికి చెందిన గ‌ద్దే మీరా ప్ర‌సాద్ అనే రైతు పోలంలో ప్ర‌భుత్వం ర‌హ‌దారి నిర్మాణం చేప‌ట్టింది. ర‌హ‌దారి వేసేంద‌కు వీలు లేద‌ని  అడ్డుప‌డినందుకు స‌ద‌రు రైతును పోలీసులు దారుణంగా  కొట్ట‌డం దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం... 
 
ర‌హ‌దారి అంశం కోర్టులో ఉన్నా కూడా లెక్క చేయ‌కుండా  పోలీసులు ఇలా రైతును కొట్ట‌డంపై ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపిఎం నాయ‌కులు మండిప‌డుతున్నారు. రాజ‌ధానికి ఇవ్వ‌ని పొలంలో  రొడ్డు నిర్మాణం ఎలా చేప‌డ‌తారంటూ రైతు మీరా ప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.