ఆ ముగ్గురితో బాబుకు పెద్ద త‌ల‌నొప్పి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 15:53:21

ఆ ముగ్గురితో బాబుకు పెద్ద త‌ల‌నొప్పి

సీఎం చంద్ర‌బాబు ప‌రిపాల‌నో దిట్ట అని 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటారు.. అయితే ఇప్పుడు మాత్రం గ‌త తొమ్మిదేళ్ల పాల‌న‌కు ఇప్ప‌టి బాబు పాల‌న‌కు సంబంధం లేదు అని మొద‌టి మూడు నెల‌ల పాల‌న‌లోనే అధికారులు గుస‌గుస‌లు వినిపించాయి.. ఇక ప్ర‌తిప‌క్షం ప్ర‌తీ పాయింట్ ప‌ట్టుకోవ‌డం, అందులో ఉన్న సాధ్యా అసాధ్యాలు, చేసిన త‌ప్పిదాల‌ను నిల‌దీయ‌డంతో తెలుగుదేశం ఎటువంటి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతోంది.
 
ముఖ్యంగా బాబు అస‌హ‌నం చూపిస్తున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎమ్మెల్యేల ప‌నితీరు డ్యాష్ బోర్డులో వ‌చ్చే అంశాల‌తో ఎమ్మెల్యేగ్రాఫ్ త‌గ్గినా, బాబు వెంట‌నే వారికి కౌంట‌ర్లు అక్షింతలు వేస్తున్నార‌ట‌.. ఆ విష‌యంలో బాబు కంట్రోల్ చేసుకోవ‌డం లేద‌ని సీనియ‌ర్ల‌కు కూడా అలాగే ఉంద‌ని చెబుతున్నారు.
 
ఇటు ఇటీవ‌ల నాయిబ్రాహ్మ‌ణుల అంశం విష‌యంలో నీది ఏఊరు, తోక‌జాడిస్తారా అని 9 ఏళ్లు త‌న పాల‌న‌లో ఏ ఒక్క‌రూ బ‌య‌ట‌కు రాలేదు అని తొంద‌ర్లో అనేశారు చంద్ర‌బాబు.. బ‌షీర్ బాగ్ కాల్పులు ఎవ‌రి హాయాంలో జ‌రిగాయో తెలియ‌దా అని ఇటు సోష‌ల్ మీడియాలో కూడా వార్త‌లు వచ్చాయి.. ఎంద‌రు ఉద్యోగులు రోడ్ల‌మీద‌కువ‌చ్చి నిర‌స‌నలు, నినాదాలు చేశారు అని విమ‌ర్శించారు.
 
అయితే ఈ విష‌యాల్లో బాబు చాలా సీరియ‌స్ అవుతున్నారు అని స‌దరు ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నారు.. మొత్తానికి ప్ర‌తిప‌క్ష నేత విమ‌ర్శ‌ల జోరు పెరిగింద‌నా. ఇటు బీజేపీ నుంచి మ‌రింత పోటు వ‌స్తోంద‌నా, లేక స్నేహితుడిగా ఉండి ప‌వ‌న్ ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వెళ్లి తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు చేస్తున్నాడ‌నా అనేది తెలియాలి. ఎందుకు ఈ అస‌హనం మ‌రో పది నెలల్లో ఎన్నిక‌లు ఉన్న కార‌ణమా అని కూడా అంటున్నారు నాయ‌కులు, ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.