క‌ల‌క‌లం జేసీ బ్ర‌ద‌ర్స్ కు కొత్త క‌ష్టాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc brothers
Updated:  2018-09-11 05:34:48

క‌ల‌క‌లం జేసీ బ్ర‌ద‌ర్స్ కు కొత్త క‌ష్టాలు

విమ‌ర్శ‌లు చేయ‌డంలో, ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదిరించ‌డంలో జేసీ బ్ర‌ద‌ర్స్ ను మించినవారు లేరన‌డంలో సందేహం లేదు. త‌ప్పు చేసినవారికి, అలాగే వారికి ఎదురు వ‌చ్చినా అంతే సంగ‌తులు అంటారు అక్క‌డి ప్ర‌జ‌లు. ఇలా ఏదో ఒక వివాదంలో త‌ల‌దూరుస్తూ త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేసి నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వార్త‌ల్లో నిలిచారు. 
 
మ‌ల్లిఖార్జున అనే బాధితుడుకి సంబంధించిన క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ ను జేసీ బ్ర‌ద‌ర్స్ క‌బ్జా చేసి దాన్ని జేసీ ట్రావెల్స్ గా మార్చుకున్నార‌ని మీడియాకు వివ‌రించారు. అయితే త‌న కాంప్లెక్స్ ను త‌న‌కు తిరిగి ఇవ్వాల‌ని బాధితుడు డిమాండ్ చేశాడు. అంతేకాదు ఇదే విష‌యాన్ని తాను గతంలో క‌లెక్ట‌ర్ కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా వారు త‌న ఫిర్యాదును ప‌ట్టించుకోకున్నార‌ని మ‌ల్లిఖార్జున వాపోతున్నారు. 
 
ఇక త‌మ‌పై ఫిర్యాదు చేశాడ‌న్న వార్త తెలుసుకున్న జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న ఆగ్ర‌హ‌న్ని వ్య‌క్తం చేశారు. సైలెంట్ గా ఉండ‌క‌పోతే నీ భ‌వ‌నాన్ని కూల్చి వేస్తాన‌ని భాదితుడికి ఫోన్ చేసి హెచ్చ‌రించారు. త‌న‌కు జేసీ బ్ర‌ద‌ర్స్ నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని,  జేసీ బ్ర‌దర్స్ క‌బ్జా చేసిన‌ క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాన్ని తిరిగి త‌న‌కు అప్ప‌గించ‌క‌పోతే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని మ‌ల్లిఖార్