క‌న్నా స్పీడు పెంచ‌లేక‌పోతున్నారా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 14:57:16

క‌న్నా స్పీడు పెంచ‌లేక‌పోతున్నారా?

వైసీపీలోకి, టీడీపీలోకి, జ‌న‌సేన‌లోకేనా, బీజేపీలోకి వెళ్ల‌లేమా అనే ఆలోచ‌న చాలా మంది నేతల్లో పెరిగేలా చేయాలి అని బీజేపీ ఆలోచిస్తోంది.. ఇటు క‌న్నాకు ఏపీ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌చెబితే ఏపీలో పెను రాజ‌కీయ మార్పులు వ‌స్తాయి అని మోదీ, అమిత్ షా భావించారు.. ఎలాగో క‌న్నా అంటే బాబుకు పొస‌గ‌దు, ఇటు బాబుకు కూడా క‌న్నా అంటే ప‌డదు, దీంతో పార్టీలు వాడి వేడిగా రాజ‌కీయంగా ఎన్నిక‌ల్లో  త‌ల‌ప‌డ‌టానికి స‌మఉజ్జీలు అని బీజేపీ భావించింది. అయితే ఇప్పుడు ప‌రిస్దితిలో ఎటువంటి మార్పులేదు.బీజేపీ త‌ర‌పున ప‌ద‌వి వచ్చిన త‌ర్వాత కన్నా బీజీ బిజీగా మారారు అంతే.. ముఖ్యంగా హ‌స్తిన‌లో పెద్ద‌ల ఆశిస్సులు తీసుకున్నారు.
 
అయితే ఏపీలో బీజేపీ ప‌గ్గాలు ఇచ్చిన త‌ర్వాత తెలుగుదేశం పై క‌న్నా ఏం సాధించారు.. తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి కాంగ్రెస్ నుంచి నాయ‌కులు ఎవ‌రినైనా పార్టీలో చేరేలా చెయ్య‌గ‌లిగారా అంటే స‌మాధానం లేని ప్ర‌శ్న, ఇక తెలుగుదేశం మాత్రం వైసీపీ నాయ‌కులు కాదు తెలుగుదేశం నాయ‌కులే టార్గెట్ గా క‌న్నా ఉన్నారు అని అనుకుంటోంది.
 
ఇక్క‌డ బీజేపీని ప్ర‌జ‌లే న‌మ్మ‌డంలేదు.. ఇక  నాయ‌కుల ఏ విధంగా న‌మ్ముతారు, అస‌లే రాజ‌కీయాల్లో ఆరితేరిన ఉద్దండులు ఉన్నారు ఇరు పార్టీల్లో... వీరు బీజేపీ మాటలు న‌మ్ముతారా?  న‌మ్మ‌శ‌క్యంగా నాలుగేళ్ల క్రితం మాట‌లే న‌మ్మి మోసం పోయామ‌ని ఇటు తెలుగుదేశం నాయ‌కులు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.
 
ఇక వైసీపీ నుంచి ఒక్క కార్య‌క‌ర్త కూడా బీజేపీలోకి వ‌చ్చేలా కనిపించ‌డం లేదు, ఇక టీడీపీ త‌ర‌పున అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి పార్టీ మారే ఆలోచ‌న‌లో లేరు నాయ‌కులు..అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకుందాం అని అనుకున్నా పార్టీలో చేర‌డాని కేడ‌ర్ తో స‌హా కీల‌క నాయకులు లేరు..ఇక కేవ‌లం ఉన్నా బీజేపీ నాయ‌కుల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌న్నా ఎన్నిక‌ల్లోకి వెళ్లాలి.. ఇంకా ఈ నాయ‌కులు అప్ప‌టి వ‌ర‌కూ పార్టీలో ఉంటారా లేదా అనేది కూడా చూడాలి.
 
ఇటు తూగోలో సోము వీర్రాజుకు బాధ్య‌త‌లు, అటు ప‌శ్చిమ‌లో మాణిక్యాల‌రావుకు, ఇటు ఉత్త‌రాంధ్రాలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు బాధ్య‌త‌లు అప్ప‌గించి ఇటు అమ‌రావ‌తి ప్రాంతం క‌న్నా చూసుకోవాలి అని అంటున్నారు పార్టీల నాయ‌కులు..చూడాలి ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరునెల‌ల ముందు ఏమైనా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఓ స‌రికొత్త ప్లాన్ తో ముందుకు వెళ‌తారామో వెయిట్ అండ్ సీ అని అంటున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.