గంటాను ఇబ్బంది పెడుతున్న టీడీపీ స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-20 13:35:18

గంటాను ఇబ్బంది పెడుతున్న టీడీపీ స‌ర్వే

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా టీడీపీ అనుకూల మీడియా కూడా చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న పై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు ఒక స‌ర్వేను చేప‌ట్టింది. ఈ స‌ర్వేలో 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను 119  సీట్ల‌కు పైగా టీడీపీ సొంతం చేసుకుంటుందని, ప్ర‌తిప‌క్ష వైసీపీ కేవ‌లం 60 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌న అనుకూల మీడియాతో బోగ‌స్ ప్ర‌చారం చేయించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు కూడా ఖండించారు. ఈ సర్వే ప్ర‌కారం తెలుగుదేశం పార్టీకి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు అయితే వెటంనే 23 మంది టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో చంద్ర‌బాబు నాయుడు ద‌మ్ముంటే రాజీనామా చేయించి బై ఎల‌క్ష‌న్స్ పెట్టాల‌ని స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక టీడీపీ స‌ర్వే, వైసీపీ విమ‌ర్శ‌లన్ని పక్క‌న పెడితే...ఈ సర్వేతో టీడీపీకి చెందిన మంత్రి గంటా శ్రీనివాస్ రావు చిక్కుల్లో ప‌డ్డారు. మంత్రి నియోజ‌కవ‌ర్గం అయిన భీమిలిలో నాలుగు సంవ‌త్స‌రాల‌నుంచి ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్రమాలు చేయ‌లేద‌ట‌. దీంతో గంటా ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ని ఎల్లో మీడియా స‌ర్వేలో తేలింది. ఇక ఈ విష‌యంపై గంటా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. త‌నపై పార్టీకి చెందిన వారే కావాల‌ని ప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఆయ‌న భాద‌ప‌డుతున్నార‌ట‌. అందుకే గంటా మంత్రివర్గ సమావేశానికి కూడా హాజ‌రు కాలేద‌ని వార్తలు వ‌స్తున్నాయి. 
 
ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో అయినా మంత్రి గంటా పాల్గొంటారా లేదా అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. మొత్తానికి టీడీపీకి చెందిన మీడియానే రాష్ట్రానికి చెందిన ఓ కీల‌క మంత్రి పై వ్య‌తిరేక‌త ఉంద‌ని సర్వేలో చెప్పిందంటే ఇక రాష్ట్రంలో టీడీపీ ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌లు ఎంత‌ సీరియ‌స్ గా ఉన్నారో అర్థం అవుతోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.