అడ్డంగా ఇరుక్కున్న బాబు ఇప్పుడు బాబు విధానం ఏమిటో తేలిపోతుంది?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-07-05 10:58:44

అడ్డంగా ఇరుక్కున్న బాబు ఇప్పుడు బాబు విధానం ఏమిటో తేలిపోతుంది?

అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి చెల‌రేగిపోవ‌డం టీడీపీకి హెరిటేజ్ వెన్న‌తో పెట్టిన విద్య అని అనుకోవ‌డానికి లేదు.. ఇటు జ‌గ‌న్ కూడా త‌న‌కు తెలిసిన రాజ‌కీయ యుక్తుల‌తో ఔరా అనిపిస్తున్నాడు.. ముఖ్యంగా పాద‌యాత్ర‌లో త‌న‌ప్రచార వైవిధ్యం చూస్తుంటేనే తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఓగుడ్ న్యూస్?  ఏమిటి అంటే మొత్తం ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం తామే క‌ష్ట‌ప‌డుతున్నాం, కేంద్రం పై పోరాడుతున్నాం అని చెప్ప‌డానికి ఓ 18 రోజుల పాటు హ‌స్తిన‌లో అవ‌కాశం దొరికింది సైకిల్ పార్టీకి.. అదే ఇక పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఇటు ఎంపీలు ఇక ప్ర‌త్యేక హూదా నినాదం  మ‌ళ్లీ తీసుకోనున్నారట‌.
 
ఇప్ప‌టికే ఫ్ల‌కార్డులు ఆర్ట‌ర్ కూడా ఇచ్చేశార‌ట‌.. అయితే  ఆగ‌స్ట్ 10 వ తేదీ వ‌ర‌కూ తెలుగుదేశం ఎంపీలు హ‌స్తిన‌లో ఉండ‌నున్నారు.. ఇక్క‌డ నుంచి టీడీపీ అధినేత ఇచ్చే ఆదేశాల‌తో లెప్ట్ రైట్ కేంద్రాన్ని వాయించ‌నున్నారు..ఇక్క‌డ మీడియా జ్యోతులు కూడా వెల‌గ‌నున్నాయి.. కేంద్రం పై పోరాటంతో ఉక్కిరి బిక్కిరి అయిన మోదీ అంటూ హెడ్డింగులు కూడా రెడీఅవుతున్నాయి.
 
ఇక మ‌రోవైపు రాజీనామాలు చేసి ఆమోదించుకుని ఇటు పార్ల‌మెంట్లో త‌మ గ‌ళం విప్పే అవ‌కాశం కోల్పోయారు వైసీపీ ఎంపీలు...ఇక హూదా పోరాటంలో వారికి స‌భ‌లో  అవ‌కాశం లేదు.. ఇక స‌భ‌లో అడుగు పెట్టే ఆస్కారం లేదు.. ఇటు ఇద్దరు రాజ్య‌స‌భ స‌భ్యులు మాత్ర‌మే త‌మ గ‌ళం పెద్ద‌ల స‌భ‌లో వినిపించే అవ‌కాశం ఉంది వైసీపీ త‌ర‌పున‌.
 
గ‌తంలో గల్లా జ‌య‌దేవ్ మిస్ట‌ర్ పీఎం అంటూ చేసిన ప్ర‌సంగం, ఈసారి ఎలా ఉండ‌బోతోంది..ఆయ‌న‌కు మిగిలిన పార్టీల ఎంపీలు స్వ‌ప‌క్ష పార్టీ ఎంపీలు  అంద‌రూ కోర‌స్ ఇస్తారా, లేదా సైలెంట్ అవుతారా, అప్పుడే  చ‌ర్చ డిబేట్లు స్టార్ట్ అయ్యిపోయాయి...  ఒక‌వేళ జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే ఇక స‌భ‌ల‌కు ఆస్కారం ఉండ‌దు... ఉన్నా త‌మ వాద‌న వినేవాడు ఉండ‌డు  అని ఇటు తెలుగుదేశానికి అంతా తెలుసు.
 
ఇక ఏతా వాత  చెప్పేది మ‌నం ఎంత చ‌ర్చించుకున్నా తెలుగుదేశం చేసే ప‌ని అంద‌రికి తెలిసిందే అని ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యారు... ఇప్పుడు ఆలోచ‌న‌లో ఫ‌స్ట్ థాట్ ఒక‌టే, గ‌తంలో వైసీపీ అవిశ్వాస తీర్మానం అని చెప్పి ప్ర‌వేశ‌పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది.. ఆ స‌మ‌యంలో టీడీపీ కూడా మ‌మ అంటూ మ‌ధ్య‌లో వ‌చ్చేసింది.. ఇక స్పీక‌ర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వ‌చ్చిందో తెలిసిందే,  స‌భ ఆర్డ‌ర్ లో లేదంటూ  ఆ విశ్వాసాలు వీగిపోయిన విష‌యం తెలిసిందే.
 
ఇక ఇప్పుడు సింగిల్ గా టీడీపీ ఉంది.. ఇప్పుడు టీడీపీ ఏం చేయ‌బోతోంది, ఇప్పుడు కూడా అవిశ్వాసం పై నోటిసు ఇస్తారా? గ‌తంలో లా కేంద్రానికి వ్య‌తిరేకంగా ఉన్న ప‌క్షాల‌తో ముందుకు వెళ‌తారా? అనేది చూడాలి.. ఇటు 40 ఏళ్ల బాబు అనుభవం అంద‌రితో క‌లిసి మాట్లాడి మోడీపై టార్గెట్ చేసే ఆలోచ‌న‌లో ఉందా.... ఇది బాబు సర్కార్, ఇక్క‌డ ఏమైనా జ‌రుగ‌వ‌చ్చు అంతా మీడియాలో చూడాల్సిందే. స్టే ట్యూన్డ్ -- ఎల్లో లైట్
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.