ప‌రిటాల వ‌ర్గీయులచుట్టు ఉచ్చు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 16:54:23

ప‌రిటాల వ‌ర్గీయులచుట్టు ఉచ్చు

అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌కవ‌ర్గంలో మంత్రి సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ అధికార బ‌లంతో అవినీతి అక్ర‌మాల‌కు అడ్డు అదుపు  లేకుండా పోయింద‌ని వైయ‌స్సార్  కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌రిటాల కుటుంబం ఓడిపోతామ‌నే భ‌యంతో శ్రీరామ్ అనుచ‌రుల‌తో నేరాలు చేయిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
అయితే పోలీసులు కూడా పరిటాల అనుచ‌రుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  టీడీపీ అధికారంలో ఉన్నంత మాత్రాన ప‌రిటాల కుటుంబానికి చ‌ట్టాలు వ‌ర్తించ‌వా అని తోపుదుర్తి ప్ర‌శ్నించారు.  హత్యలు, కిడ్నాప్ లను పరిటాల సునీత ప్రోత్సహిస్తున్నారని, ఆమెను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, అలాగే పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పోలీసులు పది క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు చెయ్యాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు
 
గ‌తంలో కూడా ప‌రిటాల అనుచ‌రులు చేస్తున్న అక్ర‌మాల‌పై తాము ఎన్నో సార్లు పోలీసుల‌కు ఫిర్వాదు చేశామని కానీ ఇంత‌వ‌ర‌కూ  వారిపై పోలీసులు ఎలాంటి చ‌ర్చ‌లు తీసుకోలేద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే ఇప్ప‌టికైనా పోలీసులు స్పందించి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌కాశ్ రెడ్డి కోరారు. లేక పోతే రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిటాల ఆగ‌డాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంద‌ని తోపుదుర్తి పోలీసుల‌ను కోరారు. పోలీసులు వారిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే టీడీపీ నాయ‌కులు రానున్న రోజుల్లో ఎటుచూసినా గూండాగిరి రాజ‌కీయాలు చేస్తార‌ని  ఆయ‌న వాపోయారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.