టీడీపీకి హీట్ పుట్టిస్తున్న ఎంపీ కోరిక

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 15:07:19

టీడీపీకి హీట్ పుట్టిస్తున్న ఎంపీ కోరిక

పార్టీ ప‌దేళ్లు అధికారానికి దూరంగా ఉండ‌టంతో తెలుగుదేశంలో కొన‌సాగిన నాయ‌కులు ఒక్క‌సారిగా 2014 లో పార్టీ అధికారంలోకి వ‌చ్చేస‌రికి పార్టీలో కీరోల్ పోషించారు.. ఇక త‌న అనుకున్న‌వారిని స‌భల్లో ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చి మంత్రుల‌ను చేసేశారు సీఎం చంద్ర‌బాబు..అలా ఎంత మంది అయ్యారో తెలిసిందే.. బాబు రాజ‌కీయం గురించి అంద‌రికి తెలిసిందే అంటారు ఆయ‌న హితులు...ఆయ‌న అభ‌యం ఇచ్చారు అంటే నెర‌వేర్చుతారు అని కితాబు కూడా ఇస్తున్నారు.
 
ఇక ఇప్పుడు తాజాగా  పార్టీ మారి రాజ్య‌స‌భ సీటు కూడా సాధించి, ఎంపీ అయిన ఆయ‌న తెలుగుదేశం పై అల‌క బూనారాట ...అయితే ఇటు ఓటింగ్ కోసం తాను పార్టీకి ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా త‌న‌కు స‌రైన రెస్పెక్ట్ లేదు అని ఆవేద‌న చెందుతున్నార‌ట‌... అలాగే తెలుగుదేశం పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నికల్లో త‌న కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని కోరార‌ట.. అయితే ఇప్ప‌టికే స‌ర్వే ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేకా లేదా మీ త‌న‌యుడికా అనేది తేల్చుదామ‌ని చెప్పార‌ట సీఎం.
 
కాని స‌ద‌రు ఎంపీ త‌న కుమారుడి సీటు పై ప‌ట్టు వ‌ద‌ల‌డం లేద‌ట, ఖ‌ర్చు అంతా త‌న‌దే అని చెబుతున్నాం, ఇక పార్టీ త‌ర‌పున మ‌రో ప‌ది నెల‌ల స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఇక్క‌డ ప్ర‌చారం త‌న కుమారుడి చేత చేయిస్తాను అని రెడీ అవుతున్నార‌ట.. అయితే ఇటు సీఎం మాత్రం ఈ సెగ్మెంట్ పై ఇప్పుడు నిర్ణ‌యం తీసుకుంటే జిల్లాలో మూడు అసెంబ్లీ  సీట్లుపై  ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌.
 
ఆ మూడు సెగ్మెంట్లు ఫిరాయింపు సీట్లు అని, ఇలా చేస్తే జిల్లాలో పార్టీకి మ‌రింత మైన‌స్ అవుతుందని ఆలోచిస్తున్నార‌ట.. ఇటు ఇద్ద‌రూ ఓసీ సామాజిక వ‌ర్గం, పైగా అక్క‌డ క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ కు ఆ కులానికి రాజ‌కీయంగా పేరు ఉంది...అదీ కూడా బాబు వెన‌క‌డుగుకి కార‌ణం అని తెలుస్తోంది.. అయితే ఓటు బ్యాంకు కోసం కాకుండా మ‌రో మూడు సీట్ల కోసం సీఎం చంద్ర‌బాబు ఆలోచిస్తున్నార‌ట‌.
 
నిజంగా ఎమ్మెల్యే సీటు ఇస్తే ఎటువంటి ప‌రిణామాలు ఉంటాయి అనేది మ‌రో నెల‌లో ఆలోచించి నిర్ణ‌యం చెబుతామ‌ని స‌ర్వే ద్వారానే టికెట్ ఎవ‌రికి అనేది చెబుతా అన్నార‌ట.. ప్ర‌జా ప‌ల్స్ కాకుండా సీటు ఇచ్చేది లేద‌ని తేల్చేశారట బాబు.. అయితే స‌ద‌రు ఎంపీ మాత్రం త‌న కుమారుడి టికెట్ కోసం జిల్లా మంత్రి అలాగే కోస్తాకు చెందిన ఓ ఎంపీతో చిన‌బాబుతో  రాయ‌బారం అందిస్తున్నార‌ట‌.. మ‌రి చూడాలి త‌న‌యుడి కి టికెట్ కోసం ఎంపీ పాట్లు ప‌డ‌తారా ఈజీగా సీటు తెచ్చుకుంటారా అనేది..?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.