ఈ సారి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు క‌ష్ట‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-14 15:56:22

ఈ సారి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు క‌ష్ట‌మే

కొద్దికాలంగా అనంత‌పురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు వ్య‌వహారం అమ‌రావ‌తిలోని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఛాంబ‌ర్ కు చేరుకున్నా కూడా ప‌రిష్కారం దొర‌క‌ని ప‌రిస్థితి. ముఖ్యంగా గుంత‌క‌ల్ సెగ్మెంట్ ప‌రిస్థితి అయితే మ‌రి దారుణంగా మారుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఉన్నారు.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా జితేంద్ర‌నే పోటీ చేస్తే ఈజీగా గెలుస్తారనే భావ‌న ప్రతీ ఒక్క‌రికి క‌లిగింది. కానీ ఈ మ‌ధ్య కాలంలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌ధుసుద‌న్ గుప్త‌ను తెర‌పైకి తీసుకురావడంతో క‌థ మొత్తం అడ్డం తిరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జితేంద్ర‌కు బ‌దులు మ‌ధుసుద‌న్ గుప్త‌ను పోటీ చేయించాల‌నే ఉద్దేశంతో జేసీ ఆయ‌న‌ను విసృత స్థాయిలో ప్ర‌చారం చేయిస్తున్నారు. ఇదే విష‌యాన్ని జేసీ, చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర వివ‌రించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే.
 
ఇక ఈ విష‌యం తెలుసుకున్నసిట్టింగ్ ఎమ్మెల్యే ఆగ్ర‌హంతో త‌న‌కు కాద‌ని మ‌ధుసుద‌న్ కు ఎలా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మండిప‌డుతున్నారు. ఇక ఈ సీటు వ్య‌వహారంపై ఇప్ప‌టికి క్లారిటీ రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాలా అనేదానిపై స&z