జ‌గ‌న్ ఆవిష‌యంలో చాలా గ్రేట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 18:34:43

జ‌గ‌న్ ఆవిష‌యంలో చాలా గ్రేట్

సినిమాల‌కు రాజ‌కీయానికి చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంటుంది అంటారు. అవును రాష్ట్రంలో దేశంలో ఎటువంటి సంఘ‌ట‌న జ‌రిగినా సినిమా న‌టుడు స్పందించాల్సిందే. అవును ప్ర‌జ‌లు బాగా క‌నెక్ట్ అయ్యేది ముందు సినిమా వారితోనే త‌రువాతే రాజ‌కీయ నాయ‌కుల‌తో అంటారు అంద‌రూ. అందుకే పార్టీల అధినేత‌లు కూడా రాజ‌కీయాలు ఎన్నిక‌లు వ‌చ్చిన స‌మ‌యంలో సినీ గ్లామ‌ర్ ను ఉప‌యోగించుకుంటారు.
 
ఏపీలో కూడా ఇప్పుడు  సినీ గ్లామ‌ర్ కోసం ప్ర‌జ‌ల ఓట్ల‌ను త‌మ‌కు మ‌ళ్లించేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి అని చెప్పాలి. అయితే తెలుగుదేశానికి సినీ గ్లామ‌ర్ కు కొద‌వేలేదు, ఇక వ‌న్ మ్యాన్ ఆర్మీలా జ‌న‌సేన అధినేత ముందుకు  వెళుతున్నారు. వైసీపికి వ‌స్తే ఇద్ద‌రు ముగ్గురు మిన‌హా సినిమాబ్రాండు ఉన్న‌వారు లేరు.. అయితే సినిమా రంగం వారు చంద్ర‌బాబుకు ఎక్కువ స‌పోర్ట్ చేస్తారు అనే పేరు ఉంది. అదే బిరుదు కూడా ఉంది.. ఒక‌రా ఇద్ద‌రు తెలుగుఇండ‌స్ట్రీలో బాబు కోసం ప‌నిచేసే వారు 24 క్రాఫ్ట్ లో ఉన్నారు. లైట్ బాయ్ నుంచి టాప్ హీరోల వ‌ర‌కూ బాబుకు స‌పోర్ట‌ర్స్ ఎక్కువ‌.
 
అయితే వైసీపీ కి ఆగ్లామ‌ర్ కాస్త త‌క్కువే, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన జ‌గ‌న్ కు కాంగ్రెస్ నుంచి ఉన్న సినీ ఫాలోయింగ్  అలాగే అప్ప‌టి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి స‌పోర్ట్ చేసిన నాయ‌కులు జ‌గ‌న్ వెంట ఉన్నారు. ఇందులో సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీని చెప్పుకోవ‌చ్చు..ఆ విషయం పక్కనపెడితే థర్టీ ఇయర్స్ పృథ్వీగా పేరుగాంచిన పృథ్వీ ఎప్పుడూ జ‌గ‌న్ కు స‌పోర్ట్ గా మాట్లాడ‌తాడు.. అస‌లే గోదావ‌రి బిడ్డ సినిమాల్లో త‌న  డైలాగుల‌తో అద‌ర‌గొడుతూ ముందుకు వెళుతున్నాడు  థర్టీ ఇయర్స్ పృథ్వీ, తెర‌పై ఆయ‌న క‌న‌బ‌డితే జ‌ఖాస్  అనాల్సిందే.
 
పృథ్వీ వైసీపీకి స‌పోర్ట్ గా మాట్లాడ‌టం, ఆయ‌న పై ప్ర‌శంస‌లు చేయ‌డం పై  ఇప్పుడు అంతా చర్చ జ‌రుగుతోంది..ఆ మధ్య జగన్ లండన్ వెళ్ళినప్పుడు పృథ్వీ లండన్‌లో జగన్‌ని కలిశాడట. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ తో కాసేపు ఆయ‌న మాట్లాడార‌ట రాజ‌కీయాల గురించి త‌న ఆశ‌యాల గురించి జ‌గ‌న్ మాట్లాడార‌ట‌. ఏళ్ళ తరబడి ప్రత్యేక హోదా కోసం పోరాడడం చిన్న విషయం కాదన్నాడు. అలా పోరాడిన ఒకే ఒక్కడు జగన్ అని ప్ర‌శంశించారు ఆయ‌న‌. అనుక్షణం ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాడుతున్న జగన్‌లాంటి నాయకులు ఇంకా చాలా మంది రావాలని అభిప్రాయపడ్డాడు పృథ్వీ. చంద్రబాబుకు ఒక్కడికే విజన్ ఉంది అనుకుంటే తప్పని జగన్‌కి అంతకుమించిన స్పష్టత, ఆశయాలు, ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు పృథ్వీ.
 
ఇక నంది అవార్డులు కొనుక్కున్న‌ట్లు తెలుగుదేశం నాయ‌కులు వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసి పార్టీ ఫిరాయించేలా చేశారు అని విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తార‌ని ఆయ‌న అన్నారు. రాజ‌కీయాల్లో నైతిక‌త ఉండాలి అది కేవలం వైయ‌స్ జ‌గ‌న్ కు మాత్ర‌మే ఉంది అని అన్నారు ఆయ‌న‌.ప్ర‌జల్లో నాడు వైయ‌స్ కు ఎంత ప్ర‌జా మ‌ద్ద‌తు వ‌చ్చిందో ఇప్పుడు జ‌గ‌న్ కు అలా మ‌ద్ద‌తు ఉంది అని అన్నారు ఫృథ్వీ.ఆ విష‌యంలో జ‌గ‌న్ గ్రేట్ అని ఆయ‌న తెలియ‌చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.