సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 01:18:22

సంచ‌ల‌న ట్వీట్

జ‌న‌సేన‌ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌రువు పేరుతో ప్రారంభించిన ఈ యాత్ర‌లో అనంత జిల్లాకు చెందిన రైతులతో భేటీ అవ‌డంతో పాటు...జ‌నసేన పార్టీ కార్యాల‌యానికి కూడా శంక‌ష్ధాప‌న చేశారు..

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా....ప‌వన్ క‌రువు యాత్రలో అధికార పార్టీ నేత‌లను క‌ల‌వ‌డంపై అనేక విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య‌మంత్రుల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డంపై తీవ్రంగా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

ఈ క్ర‌మంలో హీరోయిన్ పూన‌మ్ కౌర్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. డబ్బులు కోసం మారిపోయిన సిద్దాంతాలు, మీ అస్తిత్వం ఏంటి... అవ‌స‌రాల కోసం మారిపోయిన నిజాయ‌తీ.... నీ గుణం ఏంటి...అంటూ పూన‌మ్ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ ప‌వ‌న్ నుఉద్దేశించి ప‌రోక్షంగా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే పూనమ్ పెట్టిన పోస్ట్ పై జ‌న‌సేనాని అభిమానులు తీవ్ర స్ధాయిలో మండిప‌డుతున్నారు. దీంతో ప‌వ‌న్ ను ఉద్దేశించే పూన‌మ్ ఈ వ్యాఖ్య‌లు చేసిందన్న విష‌యం స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంద‌ని ప‌లువురు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.