చంద్రబాబుపై పురందేశ్వరి ఫైర్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

purandeswari and chandrababu naidu image
Updated:  2018-03-09 05:12:21

చంద్రబాబుపై పురందేశ్వరి ఫైర్‌

బీజేపీ నాయ‌కులు తెలుగుదేశం నాయ‌కుల మ‌ధ్య వార్ మ‌రింత పెరుగుతోంది.. కేంద్రం నుంచి తెలుగుదేశం ఎంపీలు బ‌య‌ట‌కు రావ‌డంతో, ఇప్పుడు ఏపీలో రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఏపీకి కేంద్రం ఇచ్చిన  నిధుల విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నారు అని బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి మండిప‌డ్డారు.. పోల‌వ‌రం ప్రాజెక్ట్ కు, రాజ‌ధాని నిర్మాణం, వెనుక బ‌డిన ప్రాంతాల అభివృద్దికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్క‌దోవ‌ప‌ట్టించింద‌ని ఆరోపించారు ఆమె.
 
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు తెలుగుదేశం మంత్రులు ఏపీకి కేంద్రం ఎటువంటి న్యాయం చేయ‌లేదు అంటూ దుష్ప్ర‌చారం చేస్తున్నారు అని అన్నారు..  రాష్ట్రంలో అమలవుతోన్న చాలా పథకాలు కేంద్రం నిధులతోనే నడుస్తున్నాయన్నది వాస్తవం అనేది అంద‌రికి తెలిసిందే... ఇక రాష్ట్రంలో అమ‌లు అవుతున్న చంద్ర‌న్న బీమా,నీరు చెట్టు,  24గంట‌ల విద్యుత్, పేద‌ల‌కు ఇళ్లు  ఈప‌థ‌కాలు అన్ని కేంద్రానివే... కాని ఏపీలో తెలుగుదేశం పార్టీ పేరు సీఎం పేరు పెట్టుకుని అమ‌లుచేస్తున్నారు  అని ఆమె ఫైర్ అయ్యారు.
 
కేంద్రం ఏపీకి అన్నివిధాలా సాయం చేసింది.. రాజ‌ధాని నిర్మాణానికి 2500 కోట్ల రూపాయ‌లు సాయం  చేశాం, కాని ఆ నిధుల‌ను రాజ‌ధానికి ఖ‌ర్చు చేయ‌కుండా దారి మ‌ళ్లించారు... అలాగే దేశీయ బ‌హుళార్ధ‌క ప్రాజెక్ట్ పోల‌వ‌రానికి కేంద్రం ఐదు కోట్ల రూపాయ‌లు ఇచ్చింది.. ఆ ప‌నులు లెక్క‌లు పురోగ‌తి చూప‌డం లేదు. ఇక వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ది పరిశ్ర‌మ‌ల స్దాప‌న‌కు ప‌న్ను రాయితీలు ఎప్పుడో క‌ల్పించాం అని ఆమె తెలియ‌చేశారు.
 
కేంద్ర‌ స‌ర్కారు  దేశం మొత్తానికి 10 లక్షల ఇళ్లు కట్టిస్తే.. ఒక్క ఏపీలోనే 6 లక్షల ఇళ్లు కట్టాం అనే వాస్త‌వాన్నితెలియ‌చేశారు.... కేంద్రం పై ఇటువంటి మాట ఎలా మాట్లాడుతున్నారో అని ఆమె ఫైర్ అయ్యారు. వాస్త‌వాలు అన్ని తెలుగుదేశానికి తెలుసు అని అన్నారు ఆమె.... బీజేపీని ఇక‌నైనా సెంట‌ర్ చేయ‌కుండా ఉండాలి అని ఆమె మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.