వైసీపీలోకి పురందేశ్వ‌రి అక్క‌డి నుంచే పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-18 13:52:55

వైసీపీలోకి పురందేశ్వ‌రి అక్క‌డి నుంచే పోటీ

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్నాయంటే చాలు రాజ‌కీయ నాయ‌కుల‌కు పండ‌గే పండ‌గ అనుకోండి. గెలుపు ఓట‌మిల‌ను ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు, అధిష్టానం త‌మ‌కు టికెట్ ఇస్తుందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ త‌ర్వాత త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తుంటారు రాజ‌కీయ నాయ‌కులు.
 
ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం అయిన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి విప‌రీతంగా వ‌లసలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులంద‌రు పాద‌యాత్ర చేస్తున్న జ‌గన్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసున్నారు.
 
ఇక తాజాగా బీజేపీకి చెందిన పురందేశ్వరి కూడా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్దం చేసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో త‌న భ‌ర్త‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఎంతో న‌మ్మ‌కంగా ప‌ని చేసి రాజ‌కీయంగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు.
 
ఇక తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత బీజేపీలో చేరారు. విభ‌జ‌న అనంత‌రం మొద‌టి సారిగా 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పురందేశ్వ‌రి రాజంపేట ఎంపీ సీటు ద‌క్కించుకున్నారు. కానీ త‌న ప్ర‌త్య‌ర్థి మిథున్ రెడ్డి పై ఘోర ప‌రాజ‌యాన్నిఎదుర్కొన్నారు. 
 
అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి అస్స‌లు బాగోలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండి తెలుగు రాష్ట్రాల‌ను చీక‌టి గ‌దిలో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాన్ని ఎలా విడ‌దీసిందో ఇప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో ఉండి ప్ర‌త్యేక హోదాను ఏపీకి కేటాయించ‌కుండా మోసం చేసింది. ఇక కేంద్రం చేసిన మొసాల‌న్నంటిని రాష్ట్ర‌ ప్ర‌జ‌లంద‌రూ దృష్టిలో ఉంచుకున్నారు. దీంతో పురందేశ్వ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పోటీ చేసిన రాజ‌కీయ మ‌నుగ‌డ ఉండ‌ద‌నే ఉద్దేశ్యంతో వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఒక వేళ‌ ఆమె వైసీపీలో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుంచి ఎంపీగా పోటీ చేయ్యాల‌నే ఆలోచ‌న‌లో కూడా ఉన్నార‌ట‌. ఇక జ‌గ‌న్ కూడా ఆమెకు వచ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటును ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నార‌ని తెలుస్తోంది. చూడాలి మ‌రి ఆమె వైసీపీలోకి వ‌స్తే ఎటువంటి రూటు తీసుకుంటారో వెయిట్ చెయ్యాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.