వైసీపీలోకి కీల‌క నాయ‌కురాలు?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 18:34:46

వైసీపీలోకి కీల‌క నాయ‌కురాలు?

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌లపెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా జ‌గ‌న‌నేత‌కు మద్ద‌తు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ మ‌ద్ద‌తును చూసి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల దృష్ట్యా  పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. 
 
ఇక ఇప్ప‌టికే కృష్ణా జిల్లా నుంచి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు య‌ల‌మంచిలి ర‌వి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే... ఇక తాజాగా ఈరోజు  మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు టీడీపీ నాయకుడు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త వసంత కృష్ణ ప్రసాద్‌, వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు... దీంతో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న కృష్ణా జిల్లాలో రానున్నరోజుల్లో టీడీపీ బీట‌లు వాలే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.
 
ఇక తాజాగా బీజేపీకి చేందిన పురందేశ్వరి కూడా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్దం చేసుకుంటున్న‌ట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.ఇటీవ‌లే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ త‌ర‌పున ప్ర‌చారానికి వెళ్లిన పురందేశ్వ‌రికి  కర్ణాటకలో తెలుగు ప్ర‌జ‌లు ఆమెపై అనేక విమ‌ర్శ‌లు చేశారు. దీంతో అమె బీజేపీ వీడి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై పురందేశ్వ‌రి అధికారికంగా ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు.. అయితే ఆమె పార్టీలో చేరేందుకు వ‌స్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
 
ఒక‌వేళ‌ పురందేశ్వరి వైసీపీలోకి వ‌స్తే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆమెను విజయవాడ నుంచి లేదా హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని చివ‌రికి విజయవాడ నుంచి పోటీ చేయించడానికి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. మొత్తానికి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లాలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.