బాబు పాలనపై నమ్మకం లేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-05-15 11:04:37

బాబు పాలనపై నమ్మకం లేదు

మన ప్రియతమ నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2000 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా మరియు తెలుగుదేశం ప్రభుత్వ వైపల్యాలను మరియు ఎన్నికల హామీలను నెరవెర్చని తీరును ఖండిస్తూ పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ తో పాదయాత్ర లో పాల్గొనడం జరిగింది అని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి అన్నారు.
 
పాదయాత్ర కార్యక్రమంలో పుతాలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ  కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని ఆమె అన్నారు. ఈ పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారని అన్నారు. పాదయాత్ర యదామరి, చినరెడ్డిపల్లి, వరదరాజులపల్లి, వరదరాజులపల్లి, బుదుతిరెడ్డిపల్లి, ముస్లింవాడ, చిల్లగుండ్లపల్లి, గుర్రాలమిట్టా, రోల్లవారిపల్లి, కుమ్మరపల్లి,  నల్లసిద్దనపల్లి మీదుగా సత్రం వరకు సాగిందని, ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టరాని ఆమె అన్నారు.
 
ఈ పాదయాత్ర లో ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారని, అందులో ముఖ్యం గా పిన్షన్ లు రావడం లేదు అని, డ్వాక్రారుణాలు మాఫీ కాలేదు అని, బ్యాంకు లో పెట్టిన బంగారానికి నోటీసు లు ఇంటికి వస్తున్నాయని , పక్క ఇళ్ల మాట వూసేలేదని , రైతులు అప్పులపాలైనారని ముఖ్యంగా  బెల్టు షాప్ లు రద్దు  గురించి, కుమ్మరి పెళ్లి మహిళలు చాల ఆవేదన వ్యక్తం చేశారు.
 
తమకు ఎలాగైనా న్యాయం చేయవలసిందిగా మొరపెట్టుకున్నారు అని ఆమె అన్నారు. చంద్రబాబు పాలన పైన తమకు నమ్మకం లేదని మహిళలు అంటున్నారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారని ఆమె తెలిపారు. రావాలి జగన్ - కావలి జగన్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు నినాదాలు చేసారని ఆమె తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.