చంద్ర‌బాబు పై పోటీకి నేను సిద్ద‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-30 16:46:01

చంద్ర‌బాబు పై పోటీకి నేను సిద్ద‌మే

ఈ ఆధునిక పోటి ప్ర‌పంచంలో ఏ రంగంలోనైనా స‌మఉజ్జీల‌తోనూ, లేదంటే అంత‌క‌న్నా ఎక్కువ సామ‌ర్ధ్యం ఉన్న వాళ్ల‌తో పోటిప‌డి విజ‌యం సాధించిన‌ప్పుడే స‌మాజంలో మ‌నకంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం ల‌భిస్తుంది. ముఖ్యంగా రాజ‌కీయ ర‌ణ‌రంగంలో ధీటుగా ఉన్న‌టువంటి ప్ర‌త్య‌ర్ధి పై గెలుపోందిన‌ప్పుడే పార్టీల్లో స‌ముచిత స్థానం క‌లుగుతుంది. అలాంటి పోటికి నేను సిద్దం అని అంటున్నారు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.
 
గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్లే రాచమల్లు గెలిచారని టీడీపీ నేత లింగారెడ్డి అన్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ నిలబెట్టే అభ్యర్థిని చూసి వైసీపీ షాక్‌ అవ్వాల్సిందేనని అన్నారు టీడీపీ నేత లింగారెడ్డి. దీనికి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి టీడీపీ నాయ‌కుల‌కు స‌వాల్ విసిరారు.
 
గ‌త‌ ఎన్నికల్లో తనపై పోటి చేసిన‌ వరదరాజుల రెడ్డిని బలహీన అభ్యర్థిగా భావిస్తున్నారా అని టీడీపీ నేత లింగారెడ్డిని ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తనను షాక్‌ గురిచేసే అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో న‌న్ను డించ‌డానికి సీఎం చంద్రబాబును పోటి చేయిస్తారా ఏంటి అని ఎద్దేవా చేశారు.
 
రాష్ట్రంలో తెలుగుదేశం మొత్తం నాయ‌కులు క‌లిసి వచ్చినా సరే తనను ప్రొద్దుటూరులో ఓడించలేరన్నారు. ప్రొద్దుటూరులో లింగారెడ్డి, వరదరాజుల రెడ్డిని కాద‌ని కొత్త అభ్య‌ర్థిని దించుతున్నారంటే వాళ్లు బ‌ల‌హీనుల‌ని అనుకుంటున్నారా అని  రాచమల్లు వ్యాఖ్యానించారు. తానెప్పుడూ బ‌ల‌మైన అభ్య‌ర్థే పోటికి రావాల‌ని కోరుకుంటానని ఆయ‌న‌ చెప్పారు. తన టికెట్‌కు ఎలాంటి డోకా లేదని రాచమల్లు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసే స్థాయి తనది అని రాచమల్లు చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.