దర్శకేంద్రుడు క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 11:05:13

దర్శకేంద్రుడు క్లారిటీ

గత కొంత కాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న తిరుమల తిరుపతి దేవాస్ధానం చైర్మన్ పదవిపై అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయంగా పదవుల్లో ఉన్న వారికి ఛైర్మన్ పదవి ఇవ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అనేకమంది ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ప్రముఖ తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు ఉన్నారు. ఏకంగా చైర్మన్ పదవిని రాఘవేంద్ర రావుకు ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయంపై రాఘవేంద్ర రావు స్పందిస్తూ...టీటీడీ చైర్మన్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు అప్పగించిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛాన్ చైర్మన్ గా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నానని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.