ఏపీ కాంగ్రెస్‌ కొత్త ప్రతిపాదన

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-26 12:01:04

ఏపీ కాంగ్రెస్‌ కొత్త ప్రతిపాదన

ఇటీవ‌ల కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే.  ఈ విష‌యం పై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు కేంద్రం పై త‌న నిర‌స‌న గ‌ళాన్ని వెళ్ల‌గ‌క్కాయి. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ విభ‌జ‌న చ‌ట్టంలో అంశాల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో అంశాల‌ను, ప్ర‌త్యేక హోదాను ప్ర‌క‌టించాల‌ని.... లేని ప‌క్షంలో మార్చి 6న త‌మ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇక వామ‌ప‌క్ష పార్టీలైన CPI-CPM ఈ విష‌యంపై రాష్ట్రంలో రాస్తారోకోలు, బంద్‌లు సైతం నిర్వ‌హించారు.
 
రాష్ట్ర విభ‌జ‌న‌తో ఘోరంగా ఓట‌మి పాలైంది కాంగ్రెస్ పార్టీ. ప్ర‌స్తుతం ఏపీకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.  విభ‌జ‌న చ‌ట్టంలో అంశాల‌ను, ప్ర‌త్యేక హోదాని ప్ర‌క‌టించ‌డంలో బీజేపీ ఘోరంగా విఫ‌లం అయింద‌ని, బీజేపీ, టీడీపీ, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు క‌లిసి రాష్ట్రాన్ని నిట్ట‌నిలువునా  ముంచాయ‌ని ఏపీ పిసిసి అధ్య‌క్షుడు రఘువీరారెడ్డి విమ‌ర్శించారు. కేసుల‌కు భ‌య‌ప‌డి రాష్ట్ర అభివృద్దిని ప్ర‌ధాని మోదీ కాళ్ల‌కు తాకట్టు పెట్టార‌ని ఆరోపించారు.
 
రాష్ట్రానికి ప్ర‌త్యేకహోదా ఇవ్వ‌డానికి కాంగ్రెస్‌పార్టీ సిద్దంగా ఉంద‌ని, రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వా త మొద‌టి సంత‌కం ప్ర‌త్యేకహోదా మీదే చేస్తార‌ని తెలిపారు. అయితే ప్ర‌స్తుతం హోదా సాధ‌న‌కు దేశంలోని పద్దెనిమిది పార్టీల మద్దతు కూడగడుతున్నామని ఆయన తెలిపారు. ఈ నేప‌ధ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాజ్యసభ ఎన్నికలను ప్రత్యేక హోదా కోసం బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.