ర‌ఘువీరా రెడ్డి గొప్ప స‌ల‌హా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 03:49:43

ర‌ఘువీరా రెడ్డి గొప్ప స‌ల‌హా

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. దీంతో ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పూర్తిగా భూస్థాపితం చేశారు. అయితే అవ‌కాశం వేచిచూడ‌డ‌మే రాజ‌కీయం అని అంటారు సీనియ‌ర్లు.... ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జ‌రిగింది. అవ‌కాశం కోసం కోసం వేచి చూస్తున్న కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలాగైనా  స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఉవ్విళ్లు ఊరుతోంది..
 
ప్ర‌త్యేకహోదా ఏపీ హ‌క్కు అనే నినాదాన్ని తీసుకుని ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకురావాల‌ని యోచిస్తున్నారు కాంగ్రెస్ నాయ‌కులు... అందులో భాగంగానే రాజమండ్రిలో ప్రత్యేక హోదా కోరుతూ కాగడాల ప్రదర్శన ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ... ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  ఎన్నికల హామీలను విస్మ‌రించిన‌ బీజేపీ, టీడీపీ పార్టీలను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని తెలిపారు. ఆ రెండు పార్టీలు క‌లిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. 
 
 దేశంలో అత్యుత్త‌మ‌మైన పార్లమెంట్  చట్టాలు, ప్రధాన మంత్రి హామీలు, కెబినెట్‌ నిర్ణయాలను సైతం  లెక్క‌చేయ‌కుండా నియంతపాల‌న చేస్తోందంటూ బీజేపీని విమ‌ర్శించారు రఘువీరా రెడ్డి.... ఆంధ్రుల గుండెల్లో ప్ర‌త్యేక‌హోదా అనే అంశం నాటుకుపోయింద‌ని అన్నారు... చంద్ర‌బాబు అవినీతికి పాల్ప‌డి కేసుల మాఫి కోసం ఏపీ అభివృద్దిని ప్ర‌ధాని మోదీ కాళ్లకు తాక‌ట్టు పెట్టారంటూ ఆరోపించారు. త్వ‌ర‌లో జ‌రిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై కట్‌ మోషన్‌ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.