అక్కడి నుండే పోటీ చేస్తా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 01:52:16

అక్కడి నుండే పోటీ చేస్తా...

ఏపీసీసీ అధ్యక్ష‌డు ర‌ఘువీరా రెడ్డి రెడ్డి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వూలో పాల్గొన్న ఆయ‌న ఏపీ రాజ‌కీయ ప‌రిస్ధితుల‌పై మాట్లాడారు. ఏపీలో అన్నీ సీట్ల‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం  చేశారు. 

తాము ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోకుండానే సొంతంగా ఏపీలో ఎదుగుతామ‌ని, కాని త‌మ‌కు ఏ పార్టీ శత్రువు కాద‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లా క‌ళ్యాణదుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని, గెలుస్తాన‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు అన్ని రకాలుగా  ఏపీలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని , తెలుగుదేశం పార్టీ, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలు త‌మ బ‌ల‌హీత‌ల కార‌ణంగా బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నాయ‌ని ర‌ఘువీరా రెడ్డి అన్నారు.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.