ప‌వ‌న్‌కు ర‌ఘువీరా భార్య ఝ‌ల‌క్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-13 12:54:25

ప‌వ‌న్‌కు ర‌ఘువీరా భార్య ఝ‌ల‌క్

ఇటీవ‌ల కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన  బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రిగిన  అన్యాయంపై  కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు  ప్ర‌జ‌ల‌కు వినిపిస్తున్న భిన్న వాద‌న‌ల‌పై నిజా నిజాలు తెలుసుకునేందుకు  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్దమైన విష‌యం అంద‌రికీ తెలిసిందే.  
 
అందులో భాగంగానే రాజ‌కీయ ఉద్దండులైన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ లాంటి మేధావుల‌తో  కూడిన ఒక జేయేసిని ఏర్పాటు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు ప‌వ‌న్. ఈ క్ర‌మంలో జేపీని, ఉండ‌వ‌ల్లిని ప‌వ‌న్ క‌ల‌వ‌డం జ‌రిగింది. 
 
బ‌డ్జెట్ పై నిజా నిజాలు తెలుసుకునేందుకు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నంలో కాంగ్రెస్‌ పార్టీని కూడా భాగ‌స్వామ్యం  చేయాల‌నుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇందుకోసం ప‌వ‌న్  ఏపీ పిసీసి ఛీఫ్ ర‌ఘువీరా రెడ్డిని సంప్ర‌దించారు. సోమవారం రఘువీరారెడ్డి పుట్టినరోజు కావడంతో  శుభాకాంక్షలు చెప్పి .. జేఎఫ్‌ఎఫ్‌సి (జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ) లో కాంగ్రెస్‌ పార్టీ కూడా పాల్గోనాల‌ని పవన్‌ కోరాల‌నుకున్నారు. అయితే జ‌న్మ‌దిన వేడుక కార‌ణంగా ర‌ఘువీరా అందుబాటులోకి రాలేదు.
 
దీంతో ప‌వ‌న్ నేరుగా ఆయ‌న స‌తీమ‌ణి సునీతకు ఫోన్ చేశారు. అయితే  రాజ‌కీయ అంశాలు గురించి మాట్లాడాల‌నుకుంటే మ‌రో రోజు సంప్ర‌దించాల‌ని  కోరార‌ట. మ‌రి ఈ దెబ్బ‌తో ప‌వ‌న్ మ‌రోసారి ర‌ఘువీరాను కాంటాక్ట్ అవుతారా...లేదా అన్నది చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.