ముస్లీం జ్యోతిష్యుడు సంచ‌ల‌న స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 07:54:20

ముస్లీం జ్యోతిష్యుడు సంచ‌ల‌న స‌ర్వే

2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు.... ఎవ‌రికి ఎన్ని సీట్లు వస్తాయ‌నే దానిపై  ముస్లీం జ్యోతిష్యుడు ర‌హీముల్లా ఖాన్ చెప్పిన జ్యోష్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ర‌హిముల్లాఖాన్ జోస్యంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ  కొన‌సాగుతోంది.
 
వ‌చ్చే   ఎన్నిక‌ల్లో   తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీ మ‌రోసారి విజ‌యం సాధిస్తుంద‌ని, కె.చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతార‌ని,  ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.  త్వ‌ర‌లో  జ‌ర‌గబోయే  క‌ర్నాట‌క ఎన్నికల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌యం సాధించ‌డంతో పాటు.... 2019 ఎన్నిక‌ల్లో  ఎన్టీయే స‌ర్కార్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని అన్నారు. ఎన్నిక  మాత్రం పోటీ పోటిగా జ‌రుగుతుంద‌ని ర‌హిముల్లాఖాన్ చెబుతున్నారు. 
 
ఏపీలో 175 అసెంబ్లీ సీట్ల‌కు గానూ..వైసీపీకి 102 నుండి 105 అసెంబ్లీ స్ధానాల‌ను వైసీపీ సొంతం చేసుకుంటుంద‌ని, టీడీపీకి 55-60 సీట్లు, బీజేపీకి 3-4 సీట్లు, కాంగ్రెస్ 2-3 సీట్లు, ఎంఐఎం 2-3 సీట్లు వ‌స్తాయ‌ని ర‌హిముల్లా జోస్యం  చెప్పారు. ఇక పార్ల‌మెంట్ స్ధానాల విష‌యానికి వ‌స్తే.... వైసీపీ13-14 సీట్లు, టీడీపీ 8-9 సీట్లు, బీజేపీ,కాంగ్రెస్ పార్టీ ఒక్కో సీటు గెలుస్తుంద‌ని ప్ర‌క‌టించారు. 
 
 గ‌త ముప్పై ఏళ్ల నుండి  ఎన్నిక‌ల‌పై జోస్యం చెబుతున్నాన‌ని.... తాను చెప్పేది ఖ‌చ్చితంగా వంద‌కు వంద శాతం నిజం అవుతుంద‌ని ర‌హిముల్లా ఖాన్ చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేర‌కు నిజం అవుతుంద‌నేది ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.   
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.