రాహుల్ ఫీట్‌తో షాక్ అయిన మోదీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-20 18:38:27

రాహుల్ ఫీట్‌తో షాక్ అయిన మోదీ

లోక్ స‌భ‌లో ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహూల్ గాంధీ మ‌రోసారి ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉపాధి విష‌యం గురించి తాము అడిగితే ప‌కొడీ చేసుకోమ‌న్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు.
 
2014 నుంచి బీజేపీ అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంద‌ని మండిప‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోడీ తాను అధికారంలోకి వ‌స్తే రెండుకోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి కేవ‌లం నాలుగు సంవ‌త్స‌రాల్లో నాలుగు ల‌క్ష‌ల‌మందికి మాత్ర‌మే ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని రాహూల్ గాంధీ మండిప‌డ్డారు.
 
ఇంకా రాహూల్ ఏమ‌న్నారంటే...
 
- ప‍్రధాని ఒత్తిడితోనే మంత్రి నిర్మలా సీతారామన్‌, రఫెల్‌ యుద్ధ విమానాల ధరల వివరాలను బహిర్గతం చేయడం లేదు.
- మోదీ సన్నిహితులకు లబ్ధి చేకూరేలా రఫెల్‌ కాంట్రాక్టులు ఇచ్చారు.
- అమిత్‌ షా కుమారుడు ఆస్తుల విలువను 3 నెలల్లో 16వేల రెట్లు పెంచుకుంటే మోదీ నోటి నుంచి ఒక్క మాటరాదు
- రఫెల్‌ ఒప్పందంపై వాస్తవాలను ప్రజల ముందు బయటపెట్టాలి
- ఒక్క రఫెల్‌ యుద్ధ విమనాల కాంట్రాక్ట్‌లోనే రూ. 45 వేల కోట్ల అవినీతి జరిగింది
- రైతుల‌కు మేలు చేసేందుకు మైడీకి ధైర్యం లేదు.
- దేశ స‌రిహ‌ద్దుల వ‌ద్ద  భార‌త జ‌వాన్లు  ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తే చైనా ప‌ర్య‌ట‌న‌లో డోక్లాం విష‌యాన్ని మోడీ ప్ర‌స్తావించ‌లేదు. 
- కార్పోరేట‌ర్ల రుణాన్ని మోడీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. 
- ర‌ఫెల్ ఒప్పందంలో ఒక వ్యాపార వేత్త‌కు ల‌బ్ది చేకూర్చారు. 
- క‌ర్నాట‌క‌కు చెందిన ఆ వ్యాపారికి మేలు క‌లిగేలా చేశారు. 
- గ‌తంలో రుణ‌మాఫి చెయ్యాల‌ని రైతులు చేతులు జోడించి అడిగారు.
- ఎమ్ ఎస్ పీ పేరుతో దేశ వ్యాప్తంగా కేంద్రం 10వేల కోట్లు ఇచ్చింది.
- ఒక్క క‌ర్నాట‌క ప్ర‌భుత్వ‌మే 34 వేల కోట్ల రుణ మాఫీ చేసింది. 
- మోడీ హాయాంలో మ‌హిళ‌ల‌పై గ్యాంగ్ రేప్ లు పెరిగిపోయాయి.
- ద‌ళితుల‌పై దాడులు పెరిగాయి.
- దేశంలో అన్నిచోట్ల దాడులు అఘాయిత్యాలు పెరిగాయి. 
- మోడీ, అమిత్ షా భిన్న త‌ర‌హా రాజ‌కీయ నాయ‌కులు
- అధికారాన్ని వ‌దులుకోవ‌డానికి వారు ఏమైనా చేస్తారు 
- అధికారంతో ఏం చేయ‌డాని అయినా రెడీ అవుతారు. 
- న‌న్ను విమ‌ర్శించినా, పప్పు అన్నా భ‌రిస్తా.
- నాకు బీజేపీ, ఆర్ ఎప్ ఎస్ పై ఎలాంటి విభేదాలు లేవు.
 
ఇక ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత ప్ర‌ధాని మోడీకి రాహూల్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఆలింగ‌నం చేసుకున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.