టీడీపీ పొత్తుపై రాహుల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-14 17:10:07

టీడీపీ పొత్తుపై రాహుల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

మీడియా ఎడిట‌ర్లతో జ‌రిగిన స‌మావేశంలో అధికార తెలుగుదేశం పార్టీతో పొత్తు అవ‌కాశాల‌పై జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ‌లో రెండురోజులు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఈ రోజు మీడియాతో స‌మావేశం అయి రాష్ట్రాల్లో పొత్తుల‌కు సంబంధించి తుది నిర్ణ‌యం పీసీసీల‌దే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేకాదు జ‌మిలీ ఎన్నిక‌ల‌కు  త‌మ పార్టీ పూర్తిగా వ్య‌తిరేకం అని గెలిచిన పార్టీ అయిదేళ్లు అధికారంలో ఉండ‌టం రాజ్యాంగ బ‌ద్దం అని రాహుల్ మీడియా ద్వారా స్ప‌ష్టం చేశారు.
 
గ‌త కొద్ది కాలంగా కాంగ్రెస్, టీడీపీల మ‌ధ్య‌ ర‌హ‌స్యంగా సంబంధాలు కొన‌సాగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే జ‌రిగిన‌ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా తెలుగుదేశంపార్టీ నాయ‌కులు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి ఓటు వేశారు. ఇటు ర‌హ‌స్య భేటీ అటు రాహూల్ మాట‌ల‌ను చూస్తుంటే ఖ‌చ్చితంగా 2019లో హోరా హోరీగా జ‌రిగే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్,టీడీపీలు క‌లిసి పోటీ చేసే ఆస్కారం ఎక్క‌వ‌గా క‌నిపిస్తున్నాయి. 
 

షేర్ :