ఏపీలో కొత్త స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 12:07:12

ఏపీలో కొత్త స‌ర్వే

వైయ‌స్ జ‌గన్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర  ఏపీలో మ‌రింత మైలేజ్ తీసుకువ‌స్తోంది జ‌గ‌న్ కు.. ఇక వ‌చ్చేది జ‌మిలి ఎన్నిక‌లా లేదా సార్వ‌త్రిక ఎన్నిక‌లా అనేది ఇంకా కేంద్రం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.. అయితే ఈ స‌మ‌యంలో ఏపీలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌డం, తెలుగుదేశం కేంద్రం నుంచి నిధులు తీసుకురావ‌డంలో ఫెయిల్ అవ‌డంతో ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేకుండా పోయింది  తెలుగుదేశం స‌ర్కార్ పై, అలాగే కేంద్రం నుంచి నిధులు తీసుకురావ‌డానికి ఈ నాలుగేళ్లుగా బాబు ఎటువంటి స‌త్ఫ‌లితం పొంద‌లేదు దీంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.
 
అయితే ఇటు ఏపీలో తెలుగుదేశానికి  బీజేపీ క‌టీఫ్ చెప్పేందుకు రెడీ అవుతోంది అనే వార్త వైర‌ల్ అవుతోంది.. గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు జ‌త‌క‌ట్ట‌డంతో జ‌గ‌న్ ఓట‌మి చెందారు... ఇక 2050 వ‌రకూ ఏపీ సీఎం చంద్ర‌బాబే  అంటూ తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు.
 
ఇక తెలుగుదేశానికి సంబంధించి డ్యాష్ బోర్డు కూడా ఫెయిల్ అవుతోంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దే అని చెబుతున్నా ప‌రిస్ధితులు ఎలా ఉంటాయో ఇంకా తెలియ‌డం లేదు. అయితే ఏపీలో ఎక్కువ‌గా వినిపించింది
రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే, అలాగే ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే, అదే వ‌రుస‌లో ల‌గ‌డ‌పాటి స‌ర్వే... ఈ స‌ర్వేల ఫ‌లితాలు ఎలా ఉన్నాయో కూడా తెలిసిందే.
 
తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓ స‌ర్వే చేయించార‌ట‌, సర్వే  వార్త‌లు తాజాగా ఏపీలో వైర‌ల్ అవుతున్నాయి.. ఆ స‌ర్వే ప్ర‌కారం ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీఎం అవ‌డం ఖాయం అని తేలింద‌ట‌.. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న 175 స్ధానాల్లో 115 స్ధానాలు వైసీపీ గెలుచుకుంటుంది అని తేలింద‌ట‌.. ఇక తెలుగుదేశం జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నా 50 స్ధానాల్లో గెలుపువ‌స్తుంది అని తేల్చింద‌ట స‌ర్వేలో... ఇక మ‌రో 10 సీట్లు  ఫిరాయింపులు లేక వేరే వ్య‌క్తులు రెబ‌ల్ గా ఇండిపెండెంట్లుగా సీట్లు గెలుచుకునే అవ‌కాశం ఉంది అని స‌ర్వేలో తేలింద‌ని తెలుస్తోంది..ఈ స‌ర్వే బ‌ట్టి కాంగ్రెస్ కూడా జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర అవ్వాలి అని అనుకుంటోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.