రైల్వే కోడూరులో పైచేయి ఎవరిది...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-06 01:30:05

రైల్వే కోడూరులో పైచేయి ఎవరిది...

క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి కొర‌ముట్ల శ్రీనివాసులు కేవలం 1900 పైచిలుకు ఓట్లతో మాత్రమే  ఎమ్మెల్యేగా  గెలుపొందారు.  ఆయ‌న వ‌రుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
 
గ‌తంలో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న రైల్వే కోడూరును వైయ‌స్సార్ అండ‌తో కాంగ్రెస్ కోట‌గా మార్చారు వైసీపీ సీనియ‌ర్ నేత కొల్లం బ్ర‌హ్మానందం రెడ్డి... నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా అన్నీ మండ‌లాల్లో మంచి ప‌ట్టున్న బ్ర‌హ్మ‌నంద రెడ్డి, అయన అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డంతో ప్ర‌స్తుతం ఈ అసెంబ్లీ సీటుపై టీడీపీ క‌న్నేసింది.
 
ఇక పుల్లంపేట మండలం వైసీపీకి మండ‌లం ఆయువు ప‌ట్టుగా ఉంది... ఇటీవ‌లే మ‌ర‌ణించిన సీనియ‌ర్ నేత బ్ర‌హ్మానంద‌రెడ్డి ఈ మండ‌లానికి చెందిన వారు కావడం, అయన మొన్న‌టి వ‌ర‌కు ఈ మండలాన్ని ముందుండి నడిపించేవారు... అయన ప్రభావంతో కొన్ని సంవత్సరాల నుండి ఈ మండలంలోని కొన్ని భూతులలో టీడీపీ వాళ్ళకి ఏజెంట్లు కూడా లేరు... టీడీపీ సీనియర్ నాయకుడు వత్తలూరు సుబ్బా రెడ్డి తన బలం క్రమక్రమంగా కోల్పోవడంతో ప్రతిసారి వైసీపీ తన జెండా పాతుతుంది.
 
ఇక ఓబులవారిపల్లిలో టీడీపీ- వైసీపీ పోటీ పోటీగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తిసారి వైసీపీకే మెజారిటీ ల‌భిస్తోంది... పార్టీ భవిష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు మ‌రింత ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సి ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే చిట్వేల్ మండలంలో ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ టీడీపీకే మెజారిటీ వ‌స్తోంది... కోడూరు నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జి గా ఉన్న విశ్వ‌నాథ్ నాయుడు ఈ మండలానికి చెందిన వాడు కావడం, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉండటంతో టీడీపీ కంచుకోటగా మారిపోయింది... ఇక్కడ కమ్మ సామజిక వర్గం తప్ప, ఇతర సామజిక వర్గాలలో టీడీపీ ఇంచార్జి విశ్వనాథ్ నాయుడికి తీవ్ర వ్యతిరేఖత ఉంది... ఈ వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటే వైసీపీ తన బలాన్ని కొంచెం పెంచుకోవచ్చు.
 
వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల కోడూరు మండలానికి చెందిన వారు కావడంతో, వాళ్ళ సామాజిక వర్గం కొరుముట్లకి అండగా ఉండడంతో కోడూరులో టీడీపీకి గట్టి పోటీ ఇస్తుంది... టీడీపీ కీల‌క నేత బత్యాల చంగల్ రాయుడు ఈ మండ‌లానికే  చెందిన వారు కావడం, అయన బ‌లిజ సామాజిక నేత కావ‌డం, ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఈ మండలంలో ఎక్కువ‌గా ఉండ‌టంతో టీడీపీ త‌న ఉనికి చాటుకుంటోంది... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ టీడీపీతో పొత్తు లేకుండా ఉన్నా,  ఒంట‌రిగా పోటీ చేసినా...  వారంతా టీడీపీ ఓటు వేసే అవ‌కాశం లేదు కావున  ఇక్క‌డ వైసీపీకి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది... ఈ మండ‌లంపై కూడా వైసీపీ ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సి ఉంది... బత్యాల చంగల్ రాయుడు పార్టీ మారే అవకాశం ఉంది...ఇక‌ అదే జరిగితే ఇక్కడ టీడీపీ తన ఉనికిని కాపాడుకోవడం కష్టం.
 
రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గంలో పుల్లంపేట త‌ర్వాత పెనగలూరు మండ‌లం వైసీపీకి ఆయువు ప‌ట్టు అని చెప్ప‌వ‌చ్చు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన  ప్ర‌భావ‌త‌మ్మ‌ ఈ మండలానికి చెందిన వారు కావడం, ప్ర‌భావ‌త‌మ్మ‌కు ఇక్క‌డ ముందు నుండి బ‌ల‌మైన క్యాడర్ ఉండంటంతో ఇక్క‌డ పూర్తి స్ధాయిలో వైసీపీ గాలి వీస్తోంది. 
 
పుల్లంపేట మండలం, పెనగలూరు మండలం ఈ రెండు వైసీపీ విజయానికి రెండు కళ్ళు లాంటివి, పెనగలూరు మండలంలో వైసీపీ బలంగా కనిపిస్తున్నప్పటికీ, బీసీలలో బత్యాల చంగల్ రాయుడు ఆధిపత్యాన్ని తగ్గించకపోతే టీడీపీకి కూడా బలంగా తయారయే అవకాశం ఉంది... ఇక్కడ బత్యాల చంగల్ రాయుడుకి ఆదిలోనే  అడ్డుకట్ట వేయకపోతే, రానున్న కాలంలో వైసీపీ ఇబ్బంది పడటం ఖాయం. ప్రభావతమ్మ కూడా ప్రజల్లో ఎప్పటిలాగా తిరిగితే వైసీపీకి పూర్వ వైభవం రాయడం ఖాయం..
 
రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలు 
 
1 . కొన్ని మండలాల్లో త్రాగునీటి సమస్య అధికంగా ఉంది..
2 . ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో జరుగుతున్నా అవకతవకలపై ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
3 . రైల్వే కోడూరులో మామిడి కాయల మార్కెట్ యార్డ్ ని రూపుదిద్దడంలో విఫలం.
4 . పేదవారికి ఇల్లులు ఇచ్చే విషయంలో జరుగుతున్నా అవకతవకలపై ప్రభుత్వంతో పోరాడాలి... 
 
ఎమ్మెల్యే ఈ సమస్యలపై పోరాడితే, వైసీపీ తన బలాన్ని పెంచుకోవచ్చు...
 
ఇక స్ధానిక ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీనివాస్ ప్ర‌జ‌ల‌కు, కార్య‌కర్త‌ల‌కు అందుబాటులో ఉంటూ, ఏ మాత్రం అల‌స‌త్వం చేయ‌కుండా  పార్టీని మరింత బ‌లోపేతం చేసే దిశగా ఎమ్మెల్యే అడుగులు వేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి కోడూరులో వైసీపీ జెండాను ఎగిరేయ‌వ‌చ్చు.
 
2014 లో మోడీ హవా, ప‌వన్ -  టీడీపీ క‌లిసి పోటీ చేసిన‌ప్ప‌టికీ కోర‌ముట్ల విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.  గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీ గెల‌వ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు... సీనియర్ నాయకులు బత్యాల చంగల్ రాయుడు పార్టీ మారితే, వైసీపీ విజయం నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.