నిన్న సెక్ర‌టేరియేట్ నేడు అసెంబ్లీలోకి వ‌ర్ష‌పు నీరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap assembly
Updated:  2018-08-21 11:33:48

నిన్న సెక్ర‌టేరియేట్ నేడు అసెంబ్లీలోకి వ‌ర్ష‌పు నీరు

కొద్ది కాలంగా ఏపీలో కురుస్తున్న చిన్న పాటి వ‌ర్షానికి అమ‌రావ‌తి స‌చివాల‌యం త‌డిసిముద్ద అవుతోంది. గ‌తంలో కూడా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చాంబ‌ర్ లోకి వ‌ర్షపు నీరు చేరుకుంది. ఇక అదే త‌ర‌హాలోనే మ‌రోసారి సెక్ర‌టేరియెట్ తో పాటు టీడీపీ మంత్రుల చాంబ‌ర్ లో నీరు చేరుకుంటోంది.
 
నిన్న కురిసిన చిన్న పాటి వ‌ర్షానికే స‌చివాలయ భ‌వ‌న‌పు గోడ‌లు లీక్ అయి మంత్రి గంటా శ్రీనివాస్ చాంబ‌ర్ తో పాటు మ‌రో మంత్రి అమ‌ర్ నాథ్ కార్యాలయంలోకి కూడా నీరు చేరుకుంటుంది.
 
అటునుంచి అసెంబ్లీలోకి ఈ నీరు ప్ర‌వేశించింది. ఇక  అధికారులు అసెంబ్లీ  భ‌వ‌నంలో నీరు రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇదే భ‌వ‌నంలోనే తొలి అంత‌స్తులో రిపోర్టింగ్ రూమ్ లైబ్ర‌రీ ప్ర‌తాంలోకి నీరు చేరుకుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.