నేష‌న‌ల్ జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 04:47:24

నేష‌న‌ల్ జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌న ట్వీట్

అమ‌రావ‌తి వివాదం నుంచి అంబులెన్స్ కు దారి ఇవ్వ‌ని అంశం వ‌ర‌కూ తెలుగుదేశం నాయ‌కుల‌పై నేష‌న‌ల్ మీడియా ఏ విధంగా వార్త‌ల‌ను క‌వ‌రేజ్  చేస్తుందో తెలిసిందే.. ఎంపీ గుండా గిరి నుంచి ఆర్టీఏ అధికారిపై చేయిచేసుకున్న అంశం వ‌ర‌కూ దేనిని వ‌దిలిపెట్ట‌డం లేదు నేష‌న‌ల్ మీడియా.. 
 
అయితే అధికార పార్టీ తెలుగుదేశం ఎంపీలు  - తాజాగా పార్ల‌మెంట్లో అనుస‌రించిన విధానం యావ‌త్ నేష‌న‌ల్ మీడియాల‌లో క‌నిపించింది... ఏపీకి ఎటువంటి అన్యాయం జ‌రుగుతుందో తెలిసేలా మోదీ స‌ర్కారులోభాగంగా  ఉన్న పార్టీ నాయ‌కులు సైతం ఫ్ల‌కార్డులు ప‌ట్టుకుని ఏపీకి న్యాయం చేయాలి అని కోర‌డంతో  ఈ ఘ‌ట‌న‌ హైలెట్ అవుతోంది. అలాగే వైసీపీ ఎంపీలు కూడా త‌మ నిర‌స‌న‌ను తెలియ‌చేశారు పార్ల‌మెంట్లో.
 
ఈ ప్ల‌కార్డుల‌ను ప‌ట్టుకోవ‌డం తెలుగుదేశం ఎంపీల తీరును చూసి ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు...ఇంతకీ టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘లోక్‌సభలో ఊహించని సన్నివేశాలు కనిపించాయి. సభను అర్థాంతరంగా వాయిదా పడింది. అసలేం జరుగుతోంది? టీడీపీ.. మోదీ ప్రభుత్వంలో భాగస్వామి అవునా? కాదా?’’ అంటూ ట్విటర్‌లో ఆయన ప్రశ్నించారు. 
 
rajdeep tweet
 
దీనిపై అనేక కామెంట్లు వ‌స్తున్నాయి... బీజేపీ పొమ్మంటున్నా వీరు పోవ‌ట్లేద‌ని కొంద‌రు తెలుగువారు కామెంట్లు పెడుతున్నారు.. అలాగే కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మోసం చేస్తే, ఇప్పుడు మోదీ మోసం చేశారు అని అంటున్నారు తెలుగునేత‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.