జ‌గ‌న్ కు మ‌రో 10 రోజుల్లో పెద్ద ప‌రీక్ష

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-07-05 10:58:58

జ‌గ‌న్ కు మ‌రో 10 రోజుల్లో పెద్ద ప‌రీక్ష

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఎన్నిక‌ల బ‌రిలోకి వెళ్లే నాయ‌కులు.. ఈ  స‌మ‌యంలో ఎవ‌రు ఏంచేశారు అనేది ఈ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు త‌మ‌చేతిలో ఉన్న ప్రోగ్ర‌స్ రిపోర్డుతో ఓట్లు వేస్తారు... ఓట్లు నోట్ల తాయిలాల‌కు ప‌డ‌తాయి అనేదిఈ ఎన్నిక‌ల్లో బహుశా ఈ ఎన్నిక‌ల్లో జ‌రుగ‌క‌పోవ‌చ్చు..జ‌గ‌న్ కు 2019 ఎన్నిక‌ల వ‌ర‌కూ ఎన్నిక‌ల ప‌రీక్ష లేదు అనుకోవ‌డానికి లేదు, ఇప్ప‌టికే ఏపీలో ఎన్నిక‌ల ఫీవ‌ర్ న‌డుస్తుండ‌టంతో ఇప్పుడు అంద‌రిలో ఆలోచ‌న టార్గెట్ 2019 ఎన్నిక‌లే.
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో ఎవ‌రు క‌లిసి వెళ్లినా వారి ప‌డ‌వ‌కు చిల్లు ప‌డిన‌ట్టే ..న‌ట్టేట గోదావ‌రిలో మునిగినట్టే అనే ఆలోచ‌న‌ల‌కు ఇటు ఇరు పార్టీలు వ‌చ్చేశాయి.. అందుకే అంటిముట్ట‌న‌ట్టు ఉంటున్నాయి బీజేపీతో... ఇక ఇప్పుడు జ‌గ‌న్  ఓ పెద్ద ప‌రీక్ష ఎదుర్కోబోతున్నారు..ఈ ప‌రీక్ష‌లో ఎవ‌రు ఏమిటి అనేది తేలిపోనుంది.
 
బీజేపీతో జ‌గ‌న్, చంద్ర‌బాబు ఎవ‌రు చెట్టాప‌ట్టాలేసుకు తిరుగుతారు అనేది తేలిపోయే స‌మ‌యం ద‌గ్గ‌ర‌లోనే ఉంది.. అవును రాజ‌కీయ వాస్త‌వాలు కాస్త కాఠిన్యంగా ఉంటాయి అన‌డానికి నిద‌ర్శ‌నం మ‌రికొద్దిరోజుల్లో తేలిపోనుంది..పెద్ద‌ల‌స‌భ‌ రాజ్య‌స‌భ ఈ స‌భ డిప్యూటి చైర్మ‌న్ ఎన్నిక ఇప్పుడు వైసీపికి ఓ ప‌రీక్ష పెట్ట‌బోతోంది అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆలోచ‌న‌గా ఉంది.
 
రాష్ట్ర‌ప‌తి ఓటింగ్ కు జ‌గ‌న్ స‌పోర్ట్ గా ఎన్డీయేకు మ‌ద్ద‌తు ఇచ్చారు...ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లో ఎటువంటి ప‌రిస్దితి వైసీపీ చూప‌నుంది అనేది ఆలోచ‌న స్టార్ట్ అయింది...స‌భ‌లో స‌గానికి పైగా స‌భ్యుల ఓట్లు ఏ పార్టీకి మెజార్టీ లేదు.. దీంతో ఎన్డీయే యూపీఏ ప‌క్షాలు అన్నీ ఆలోచ‌న‌లో ఉండి పోలిటిక‌ల్ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. వైసీపీ నుంచి ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు ఇటు తెలుగుదేశం నుంచి ఐదుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నారు.. అయితే వీరు ఇప్పుడు ఎవ‌రికి ఓటు వేస్తారు అనేది పెద్ద ఆలోచ‌న‌.
 
ఇక జూలై 18 నుంచి జ‌రిగే పార్ల‌మెంట్ స‌మ‌వేశాలకు ముందే చైర్మ‌న్ ఎన్నిక‌పై నిర్ణ‌యం తీసుకోవాలి.. అయితే రాజ్య‌స‌భ‌లో 241 మంది స‌భ్యులు ఉన్నారు.. ఇక వీరికి అధ‌నంగా రాష్ట్ర‌ప‌తి త‌న అధికారంలో ముగ్గురిని నామినేట్ చేస్తారు మొత్తం 244 మంది ఇందులో  స‌గం మంది ఏకాభిప్రాయంగా చైర్మ‌న్అభ్య‌ర్దికి ఓట్ చేయాలి.. అయితే ఇటు యూపీఏ అంటే కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షాలు క‌లిసి 116 మంది స‌భ్యులు ఉన్నారు.. ఇటు ఎన్డీయే నుంచి 108 మంది స‌భ్యులు ఉన్నారు.. దీంతో 123 ఓట్లు కు గాను ఏ పార్టీకి ఫుల్ స‌పోర్ట్ లేదు.. ఇటు బీజేపీకి 15 ఓట్లు అటు కాంగ్రెస్ కు 7 ఓట్లు మైన‌స్ ఉన్నాయి.. అందుకే పార్టీ త‌ర‌పున మ‌న‌కు స‌పోర్ట్ అంటే వారికి ఏదైనా హామీ ఇచ్చేలా బీజేపీ ఉన్నా, వారి నుంచి విడిపోయిన టీడీపీ లాంటి పార్టీలు త‌మ వ్యూహాన్ని ఎలా చూపుతారు అనేది చూడాలి.
 
ఇటు జ‌గ‌న్ ను రాజ‌కీయంగా ఇరికించాలి అని వైసీపీ ని ఇరుకుపెట్టాలని టీడీపీ కూడా ఆలోచిస్తోంది... ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ ఎటువంటి స్టెప్ వేస్తాడో చూసి రాజ‌కీయంగా పావులు క‌దుపుదామ‌ని చూస్తున్నారు.. ఒక‌వేళ బీజేపికి అంటే ఎన్డీయేకు జ‌గ‌న్ స‌పోర్ట్ చేస్తే అక్క‌డ చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఉన్నా ఇక్క‌డ ఆయ‌న‌కు ఉన్నా పొలిటిక‌ల్ గ్రాఫ్ మొత్తం త‌గ్గిపోతుంది.. ఇక వైసీపీ ఈవిష‌యంలో చాలా ఎదురుదెబ్బ ఎదుర్కొంటుంది.
 
ఇటు ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది కాబ‌ట్టి తాము బీజేపీకి వ్య‌తిరేకం అని, ఎన్డీయేకు మ‌ద్ద‌తు ఇవ్వం అంటే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ బీజేపీ నాయ‌క‌లు వైసీపీ వైపు చూడ‌రు..ఇది జ‌గ‌న్ కు మ‌రింత మైలేజ్ తెచ్చే అంశం.. ఇక త‌ర్వాత అక్క‌డ ఎన్నిక‌ల ప్రాసెస్ లో కాంగ్రెస్ ఎన్డీయే ఓ ఒప్ప‌దంతో ముందుకు వెళ‌తాయి అందుకే జ‌గ‌న్ ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి.. ప‌దిరోజుల్లో పెద్ద ప‌రీక్ష జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి..?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.