మోగింది మ‌రో ఎన్నిక‌ల న‌గారా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-24 10:48:46

మోగింది మ‌రో ఎన్నిక‌ల న‌గారా ?

ఏపీలో గ‌త నాలుగు నెల‌లుగా అంద‌రూ ఎదురుచూస్తున్న‌టు వంటి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల న‌గారా మోగింది.. తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయింది.. దేశంలో 16 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 58 రాజ్య‌స‌భ స్ధానాల‌కు మార్చి 23 న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న‌ట్లు ఈసి తెలియ‌చేసింది.
 
మార్చి ఐదోవతేదిన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంది.. అలాగే నామినేష‌న్ కు చివ‌రి తేది మార్చి 12, ఇక మార్చి 13 వ తేదిన నామినేష‌న్ల ప‌రిశీల‌న ఉంటుంది.. ఇక మార్చి 15 వ‌ర‌కూ నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణకు గ‌డువు ఉంటుంది.. మార్చి 23న పోలింగ్ జ‌రుగ‌నుంది. ఇక అదే రోజు కౌంటింగ్ ఫ‌లితాల ప్ర‌క‌ట‌న ఉంటుంది.
 
తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి చెరో మూడు స్ధానాలు రానున్నాయి...ఏపీ నుంచి చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్‌ గౌడ్‌ల పదవీకాలం ముగియనుంది... అలాగే తెలంగాణ నుంచి ఆనందభాస్కర్‌, సీఎం రమేష్‌, పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి ప‌ద‌వి ముగియనుంది.. ఇక ఏపీలో మూడుస్దానాల‌కు గాను తెలుగుదేశానికి రెండు స్ధానాలు, వైసీపీ ఓ స్దానం ద‌క్క‌నుంది. 
 
వైసీపీ త‌ర‌పున వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి పేరును జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.. ఇటు తెలుగుదేశం త‌ర‌పున చిరంజీవి లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ పేర్లు వినిపిస్తున్నాయి... అలాగే మంత్రి య‌న‌మ‌ల‌కు కూడా అవ‌కాశం ఉంటుంది అని కొంద‌రు భావిస్తున్నారు.. మ‌రి తెలుగుదేశం ఇంకా ఈ అభ్య‌ర్దుల తుది నిర్ణ‌యం వెల్ల‌డించాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.