రామ రామ అంటే కామ కామ అన్నట్లు....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 15:32:37

రామ రామ అంటే కామ కామ అన్నట్లు....

ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన చంద్ర బాబు పై ప్రతిపక్ష పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మోకరిల్లడంలో చంద్ర బాబుకి ఒలింపిక్ మెడల్ ఇవ్వొచ్చు అని ఆమె ఎద్దేవా చేసారు. దీనిపై పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత స్పందిస్తూ ముద్దుల పోటీలలో YS జగన్ కి ఈ మెడల్ ఇవ్వాలో చెప్పాలని ఆమె అన్నారు.
 
విశ్లేషణ.. 
 
ఓటుకి నోట్ కేసు కోసం ప్రత్యేక హోదా ఉద్ద్యమాన్ని తాకట్టు పెట్టి తీరా ఎన్నికల సమయాన హోదా నినాదాన్ని నెత్తుకి ఎత్తుకున్న బాబు గారిని చూస్తుంటే సగటు రాజకీయా అవగాహన ఉన్న ఏ ఒక్కరికి కూడా రక్తం మరగక మానదు. మా బాబు బంగారం అన్న మన పచ్చ మీడియా పైత్యం చూస్తుంటే కులం కోసం ధనం కోసం కొంత మంది స్వార్ధపరుల వల్ల ఆంధ్రరాష్ట్రం ఏమవుతుందో అనిపిస్తోంది.
 
పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకం అంత పచ్చగా కనిపించినట్లు మన పసుపు పార్టీలో ఉన్న నాయకులకి జగన్ ఏమి చేసిన తప్పుగా కనిపిస్తోంది. మీ పార్టీ అధ్యక్షుడి బావ మరిది లెజెండ్ సినిమా లో చెప్పిన డైలాగ్స్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మగవాడి మైండ్ సెట్ మారాలి, కానీ ఇపుడు మన పచ్చ నాయకుల మైండ్ సెట్ మారాలి. చూసే చూపుకి బట్టి మన వ్యక్తిత్వం ఉంటుంది అని అంటారు. నిజమే కాబోలు తల్లి వయసు ఉన్న మహిళకి ముద్దు పెడితే రాద్దాంతం చేసారు...ఇపుడు ఏమో కూతురు వయసు ఉన్న మరో మహిళా ముద్దు పెడితే అంతే రాద్ధాంతం చేస్తున్నారు పచ్చ సోదరులు.
 
బాబుపై ఈగ కూడా వాలనివ్వని ఈ పచ్చ సైన్యాన్ని చూస్తుంటే ఒక్కసారి మనం డెమోక్రసి లో ఉన్నామా అనిపిస్తోంది. లేకపోతే మరి ఏంటి హోదా గురించి ప్రతిపక్షం మాట్లాడుతుంటే, హోదా పక్కన పెట్టి జగన్ ముద్దుల గురించి మాట్లాడుతున్నారు మన ఈ అధికార పక్షం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.