ర‌మ‌ణదీక్షితులు చ‌ర్చ‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy and ramana deekshithulu
Updated:  2018-06-07 05:45:41

ర‌మ‌ణదీక్షితులు చ‌ర్చ‌లు

తిరుమ‌లలో శ్రీవారి గురించి వినాల్సిన వార్త‌లు, ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముకుంటున్నాయి..తిరుమ‌ల ఆల‌యంలో నిత్య కైంక‌ర్యాల వార్త‌లు వినాల్సింది ఇప్పుడు ఇక్క‌డ రాజ‌కీయ చ‌ర్చ‌ల గురించి వింటున్నాం.టీటీడీ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి,కోట్ల రూపాయ‌ల స్వామివారి న‌గ‌లు భ‌ద్రంగా లేవ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తిరుమ‌ల పూర్వ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితులు..ఇది చిలికి చిలికి రాజ‌కీయ చ‌ర్చకు దారితీసింది.
 
ఈరోజు ఆయన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు.. పాద‌యాత్ర పూర్తిచేసుకుని హైద‌రాబాద్ వెళ్లిన వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో లోట‌స్ పాండ్ లో ఆయ‌న భేటీ అయ్యారు.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్ సాధ‌రంగా ఆయ‌న్ని ఆహ్వానించారు.
 
టీటీడీలో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని కొద్ది రోజులుగా ర‌మ‌ణ‌దీక్షితులు తెర‌పైకి వ‌చ్చి విమ‌ర్శ‌లు చేస్తున్నారు దీనిపై తెలుగుదేశం పార్టీ కూడా ఇవ‌న్నీ కుట్ర‌పూరిత వ్యాఖ్య‌లు అని కొట్టిపారేస్తోంది.. పింక్ డైమండ్ స్వామివారి సేవ‌లో ఉండేద‌ని,  అది దేశం ఎలా దాటిందో అని కొత్త చ‌ర్చ‌ను తీసుకువ‌చ్చారు ఆయ‌న‌.. టీటీడీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన సిబ్బంది వల్ల అర్చకులంటే చులకన భావన ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఇటు పోటాపోటీగా టీటీడీ అలాగే ర‌మ‌ణ‌దీక్షితులు మీడియా సమావేశాలు పెడుతున్నారు.. త‌నపై కావాలంటే సీబీఐ విచార‌ణ వేసుకోవాల‌ని స‌వాల్ చేశారు... తిరుమ‌ల‌లో ఇలాంటి అప‌చారాలు జ‌రుగుతున్న కార‌ణంగానే స్వామివారి తేజ‌స్సు త‌గ్గుతోంద‌ని భ‌క్తుల‌కు స్వామి అనుగ్ర‌హం దొర‌క‌ద‌ని ఆయ‌న అన్నారు. జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులు టీటీడీకి పట్టిన ఏలినాటి శనిలాంటి వారని విమర్శించారు ఆయ‌న‌.. ఇక బాలసుబ్రమణ్యం హయాంలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేశారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.
 
త‌న‌కు ఎవ‌రు సాయం చేస్తే వారి వైపే ఉంటామ‌న్నర‌మ‌ణ దీక్షితులు, కొంద‌రు అధికారుల తిరుమ‌ల ప్ర‌తిష్ట దెబ్బ‌తీస్తున్నారు అని విమ‌ర్శించారు. తిరుమ‌ల వివాదాలపై ఆయ‌న జ‌గ‌న్ తో చ‌ర్చిస్తున్నారు. తిరుమ‌ల‌లో త‌న‌కు స్దానం లేకుండా చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జ‌గ‌న్ ని క‌లిస్తే త‌ప్పేంట‌ని, సీఎం చంద్ర‌బాబును క‌ల‌వాలి అని చాలా సార్లు ప్ర‌య‌త్నించా అని అన్నారు ర‌మ‌ణ‌దీక్షితులు.ఇక మీరాసీ వ్య‌వ‌స్ధ‌ను కాపాడాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు ర‌మ‌ణ‌దీక్షితులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.