వెయ్యికాళ్ల‌ మండ‌పం కింద గుప్త‌నిధులు..? వంద‌కోట్ల‌ప‌రువు న‌ష్టం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ramana deekshithulu
Updated:  2018-06-20 01:23:21

వెయ్యికాళ్ల‌ మండ‌పం కింద గుప్త‌నిధులు..? వంద‌కోట్ల‌ప‌రువు న‌ష్టం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ర‌మ‌ణ దీక్షితులు ఈ రోజుహైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఆ స‌మావేశంలో ర‌మ‌ణ దీక్షితులు మాట్లాడుతూ, దేవాలయాల్లో పూర్వికుల కాలంనాటి నుంచి టీటీడీలో శ్రీవారికి సేవ‌లు అందిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.ఇటీవ‌లే త‌న‌కు టీటీడీ బోర్డు వారు నోటీసులు ఇచ్చార‌ని అన్నారు. కొద్ది రోజుల క్రితం తాను చేసిన కొన్ని ఆరోప‌ణ‌ల‌కు ప‌రువు న‌ష్టం కింద సుమారు త‌న‌పై వంద‌కోట్ల‌కు పైగా ప‌రువు న‌ష్టం దావా వేసిన‌ట్లుగా త‌న‌కు నోటీసులు వ‌చ్చాయ‌ని తెలిపారు.
 
అయితే త‌న‌కు టీటీడీ బోర్డు వారు పంపించిన‌ నోటీసులు చాలా విచిత్రక‌రంగా ఉంద‌ని అన్నారు. తాను గ‌తంలో కేవ‌లం స్వామి వారికి సేవ‌లు జ‌రుగ‌లేద‌ని, అలాగే స్వామివారి యొక్క ఆస్తులు కొల్ల‌గొట్ట‌బ‌డుతున్నాయ‌ని చెప్పినందుకు వంద‌కోట్ల‌ ప‌రువున‌ష్టం వేశార‌ని ర‌మ‌ణ దీక్షితులు అన్నారు.అయితే త‌న‌పై ప‌రువు న‌ష్టం వేసే ముందు శ్రీవారి యొక్క ఆభ‌ర‌ణాలు అన్ని క‌రెక్ట్ గా ఉన్నాయా లేదా అని నిరుపించుకోవాల‌ని, వారు నిరూపించుకున్న త‌ర్వాత త‌న ఆరోప‌ణ‌లు అస‌త్య‌మైన‌విగా భావించి అప్పుడు టీటీడీ బోర్డు త‌న‌పై ప‌రువున‌ష్టం దావా వేయాల‌ని ర‌మ‌ణ దీక్షితులు స్ప‌ష్టం చేశారు.
 
అయితే టీటీడీ బోర్డు ఇవ‌న్ని చేయ‌కుండా ముందుగానే త‌న‌పై వంద‌కోట్లు ప‌రువు న‌ష్టం వేయ‌డం ఏంట‌ని అన్నారు. టీటీడీ బోర్డు వారికి ఇలాంటి స‌ల‌హా ఇచ్చిన వారు కూడా మంచి మ‌హానుభావుడ‌ని అన్నారు. వెంక‌టేశ్వ‌ర స్వామికి ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తులు ఉన్నార‌ని, అలాంటి స్వామివారి ఆల‌యంలో పూజ‌ల్లో అప‌చారం జ‌రుతున్నాయ‌ని అన్నారు. ఇవ‌న్ని తాను అధికారుల‌కు చెప్పినందుకు త‌న‌పై ప‌రువు న‌ష్టం వేశార‌ని అన్నారు. ఇలా ప‌రువున‌ష్టం వేయ‌డానికి టీటీడీకి ఎవ‌రు అధికారం ఇచ్చార‌ని ర‌మ‌ణ దీక్షితులు ప్ర‌శ్నించారు. 
 
టీటీడీలో జ‌రుగుతున్నవ‌న్నితాను విరించినందుకు ఇలా ప‌రువున‌ష్టం వేశార‌ని అన్నారు. అస‌లు మ‌నం ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా లేక అప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా అని ర‌మ‌ణ‌ దిక్షితులు అన్నారు. ఆ ఆరోప‌ణ‌ల‌ న్నంటిపై, స్వామి వారి సేవ‌ల‌పై కూడా సీబీఐ విచార‌ణ చేయాల‌ని ర‌మ‌ణ దీక్షితులు కోరారు. అలాగే వెయ్యి కాళ్ల‌ మండ‌పం కింద గుప్త నిదులు దొరికాయ‌ని అన్నారు. స్వామివారి న‌గ‌ల‌పై భాద్య‌త లేకుండా పోయింద‌ని త‌రుగు రాలిపోతున్న డైమాండ్ రాళ్ల‌పై భాద్య‌త లేకుండా పోయింద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతోపాటు తాను చేసిన ఆరోప‌ణ‌ల‌పైన సీబీఐ విచార‌ణ చేయాల‌ని ర‌మ‌ణ దీక్షితులు కోరారు.

షేర్ :

Comments

1 Comment

  1. ! ! : [url=http://kinofly.net/] [/url] : http://kinofly.net/anime/ 2018 : [url=http://kinofly.net/boevik/] 2017 [/url] 2018 2017 2018 : http://kinofly.net/detektiv/ 2017 : http://kinofly.net/news/11977-benisio-del-toro-otkazalsya-ot-uchastiya-v-hischnike.h

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.