క‌డ‌ప రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం వైసీపీలోకి రామసుబ్బారెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-06 11:42:17

క‌డ‌ప రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం వైసీపీలోకి రామసుబ్బారెడ్డి

జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి వైసీపీని వీడి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న‌ప్ప‌టినుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గం కీల‌క ప‌రినాత్మ‌కంగా మారుతోంది. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న కుటుంబం కావ‌డంతో ఆదినారాయ‌ణ రెడ్డి రాక టీడీపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో కీల‌కనేత రామ‌సుబ్బారెడ్డితో ఎమ్మెల్యేకి త‌ర త‌రాలుగా గొడ‌వ‌లు ఉన్నాయి. అంతేకాదు వీరిద్ద‌రికి స‌ర్దుబాటు చెయ్య‌డంలో అధిష్టానానికి పెద్ద‌త‌ల‌నొప్పిగా మారుతోంది. ఇక ఈ విభేదాల‌తోనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రామ‌సుబ్బారెడ్డి టీడీపీ వీడుతార‌నే ప్ర‌చారం జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. 
 
అన్ని వ‌దిలి పోటీకి సిద్దం అవ్వు..
 
ఇక పులివెందులే త‌మ నెక్స్ట్ టార్గెట్ అంటున్న టీడీపీ... జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెడుతోంది. నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ స‌తీష్ రెడ్డికి వ్య‌తిరేకంగా గెలిచిన బీటెక్ ర‌వితో పాటు మ‌రికొంద‌రు గ్రూప్ క‌ట్టార‌నే ప్ర‌చారం సాగుతోంది. స‌తీష్ రెడ్డి పార్టీ త‌ర‌పున ఎమ్మెల్సీ ప‌ద‌విని ఆశించినా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ప్ర‌తిపక్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోటీకి సిద్దం కావాల‌ని అధినాయ‌క‌త్వ ఆదేసించిన‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. 
 
ఒక్క సీటు ముగ్గురు పోటీ.. 
ఇక ఎస్సీ  రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గం అయిన బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే జ‌య‌రాములు కూడా అధికార ప్ర‌లోభాల‌కు అశ‌పడి గ‌తంలో ముఖ్య‌మంత్రి చ‌ద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఎమ్మెల్యే త‌న ప‌ద‌విని అడ్డుపెట్టుకుని స్వ‌ప్ర‌యోజ‌నాలు పొందుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గతంలో జ‌య‌రాములు అధికార పార్టీలో చేరాక అభివృద్ది ప‌నుల్లోను ఆయ‌న త‌న లాభ‌న‌ష్టాల‌ను భేరీజు వేసుకుంటున్నార‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌. 
 
విజ‌య జ్యోతి టీడీపీ త‌ర‌పున నియోజ‌క‌వర్గ బాధ్య‌త‌ల‌ను చూస్తున్న బ‌ద్వేల్ ల్లో మాజీ మంత్రి వీరా రెడ్డి కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ‌కు ప‌ట్టు ఎక్కువ‌గా ఉంది. ఇక ఇటీవ‌లే జ‌య‌రాములు వైసీపీ నుంచి టీడీపీలో చేర‌డంతో ఈ ముగ్గురు మ‌ధ్య‌గ్రూప్ త‌గాదాలు ఎక్క‌వ‌గా పెరిగిపోతున్నాయి. అంతేకాదు ఈ ముగ్గురు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధిష్టానం త‌మ‌కంటే త‌మ‌కు సీటు ఫిక్స్ చెయ్యాల‌ని మండిప‌డుతున్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.